జ‌గ‌న్ వ‌ద్ద జాబితా.. ఓకే చెప్ప‌డ‌మే త‌రువాయి.. ఆ నేత‌ల‌కు గాలం..?

ఏపీలో అధికార పార్టీ వైసీపీ టీడీపీని బ‌ల‌హీన‌ప‌రిచే వ్యూహం అమ‌లు చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది.ఎన్నిక‌లు ముంచుకొస్తున్న వేళ పార్టీపై ఫోక‌స్ పెట్టిన సీఎం జ‌గ‌న్ వ‌రుస‌గా ఎమ్మెల్యేల‌తో.

 Jagans List The Only Thing To Say Is Ok Those Leaders Have A Problem, Cm Jagan ,-TeluguStop.com

పార్టీ ముఖ్య కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశానికి టైమ్ కేటాయిస్తున్నారు.మిగిలిన ఈ రెండేళ్లు పాలనతో పాటు పార్టీకి కూడా కొంత సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నార‌ట‌.

అలాగే నియోజకవర్గాల్లో నెలకొన్న విభేదాలను పరిష్కరించుకుని పార్టీని మరింత ముందుకు తీసుకుపోయే వ్యూహరచనలో ఉన్నారు.అయితే మ‌రో విష‌యం ఏంటంటే టీడీపీని బలహీనం చేసే ప్రయత్నాలకు జగన్ సిద్ధమవుతున్నారు.ఇప్పటికే కేసులతో అనేక మందిని ఇబ్బందులకు గురి చేశారన్న ఆరోపణలు వినిపించినా వెనక్కు తగ్గలేదు.

చేరిక‌ల‌తో టీడీపీని బ‌ల‌హీన‌ప‌ర్చ‌డానికి…

ఇక ప్ర‌స్తుతం టీడీపీని మరింత వీక్ చేసేందుకు మరో వ్యూహానికి సిద్ధమవుతున్నారని తెలిసింది.ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ముఖ్యమైన నేతలను వైసీపీలో చేర్చుకునేందుకు ప‌క్కా ప్లాన్ అమ‌లు చేస్తున్న‌ట్లు స‌మాచారం.ఇప్ప‌టికే ఒక లిస్ట్ ని జ‌గ‌న్ వ‌ద్ద ఉన్న‌ట్లు.చెబుతున్నారు.అందులో సీఎం జ‌గ‌న్ ఫైన‌లైజ్ చేసి చేరిక‌ల‌కు ఆహ్వానాలు పంపుతార‌ని అంటున్నారు.

అయితే టీడీపీలో టికెట్ దక్క‌ద‌ని భావించే నేత‌లు వైసీపీ వైపు చూస్తున్న‌ట్లు తెలుస్తోంది.ఇక వైసీపీకి వ్య‌తిరేక‌త ఉన్న ప్రాంతాల్లో కూడా టీడీపీ పుంజుకోకుండా అక్క‌డి నేత‌ల‌ను వైసీపీలోకి లాగేప‌నిలో ఉన్నార‌ట‌.

టీడీపీ నేత‌లు కూడా ఎలాగు త‌మ‌కు సీటు ద‌క్క‌ద‌నే టెన్స‌న్ తో ఓకే చెబుతున్నార‌ట‌.

Telugu Chandra Babu, Cm Jagan, Tdp-Political

ఇప్ప‌టికే వైసీపీతో ట‌చ్ లో ఉన్నారా.?

అయితే అలాంటి వారిని పార్టీలోకి తీసుకునేందుకు జగన్ ఓకే చెప్పాడ‌ని స‌మాచారం.జగన్ కూడా సిట్టింగ్ లలో చాలా మందిని మారుస్తారన్న ప్రచారం జరుగుతుండటంతో టీడీపీ నేత‌లు టికెట్ ఆశించి టచ్ లోకి వ‌స్తున్న‌ట్లు చెబుతున్నారు.

అయితే టిక్కెట్ పై హామీ ఇవ్వకపోయినా జగన్ పై ఉన్న నమ్మకంతో చేరవచ్చని నెల్లూరు జిల్లాకు చెందిన ఒక నేత వ్యాఖ్యానించడం విశేషం.ఇక త్వ‌ర‌లోనే కొందరు నేత‌లు చేరే అవ‌కాశం కూడా ఉంద‌ని అంటున్నారు.

జ‌గ‌న్ ఓకే చెప్ప‌డ‌మే త‌రువాయి.చేరిక‌ల జోరందుకుంటుందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube