కళ్యాణ్ రామ్ మెగాస్టార్ అంటూ నందమూరి ఫ్యాన్స్ కామెంట్లు.. కానీ?

జూన్, జులై నెలలలో థియేటర్లలో విడుదలైన సినిమాలలో మెజారిటీ సినిమాలు డిజాస్టర్ రిజల్ట్ ను అందుకోవడంతో పాటు నిర్మాతలకు భారీ మొత్తంలో నష్టాలను మిగిల్చాయి.అయితే ఆగష్టు నెల 5వ తేదీన విడుదలైన బింబిసార సినిమా మాత్రం ప్రస్తుతం బ్లాక్ బస్టర్ టాక్ తో ప్రదర్శితమవుతోంది.

 Nandamuri Hero Kalyan Ram Megastar Tag Details Here Goes Viral Kalyan Ram, Bimb-TeluguStop.com

బింబిసార సక్సెస్ తో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లకు కళ వచ్చింది.సినిమాకు పాజిటివ్ టాక్ రావడం వల్ల ఇతర భాషల్లో కూడా రాబోయే రోజుల్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

అయితే కళ్యాణ్ రామ్ అభిమానులు మాత్రం మెగాస్టార్ కళ్యాణ్ రామ్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.ట్విట్టర్ లో ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుండగా కళ్యాణ్ రామ్ అభిమానులు సంతోషిస్తుంటే మెగా అభిమానులు మాత్రం ఫీలవుతున్నారు.

ఈ విధంగా ఫ్యాన్ వార్స్ ఏ హీరో అభిమానులకు మంచిది కాదు.బింబిసార సినిమా విషయానికే వస్తే ఈ సినిమా కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో అనే చెప్పాలి.

Telugu Bimbisara, Catherine Tresa, Chiranjeevi, Kalyan Ram, Tag, Samyuktha Menon

దర్శకుడు వశిష్ట స్క్రిప్ట్ కోసం ఎంత సమయం కేటాయించారో తెలియదు కానీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఈ స్క్రిప్ట్ ఉండటం గమనార్హం.కళ్యాణ్ రామ్ సినిమాలో డ్యూయల్ రోల్ చేశాడనే విషయం సినిమా విడుదలయ్యే వరకు రివీల్ కాకపోవడం కూడా ఈ సినిమా సక్సెస్ కు ఒక విధంగా కారణమని చెప్పవచ్చు.కళ్యాణ్ రామ్ కోరుకున్న సక్సెస్ ఈ సినిమాతో దక్కిందనే చెప్పాలి.అయితే సినిమాలో హీరోయిన్ల పాత్రలకు మాత్రం పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం గమనార్హం.అటు కేథరిన్ పాత్ర, ఇటు సంయుక్త మీనన్ పాత్ర సినిమాకు పెద్దగా ప్లస్ కాలేదు.వశిష్టకు ఈ సినిమా సక్సెస్ వల్ల రాబోయే రోజుల్లో పెద్ద సినిమాలకు దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube