బీసీలపై సీఎం జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.జగన్ బీసీలను ఉద్ధరించామని చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు.
బీసీలు అంటే టీడీపీ అని, టీడీపీ అంటే బీసీలని చెప్పారు.పేరుకు మాత్రం బీసీ పదవులు ఇచ్చి పెత్తనం అంతా రెడ్డిలకు ఇచ్చారని మండిపడ్డారు.
రాష్ట్రాన్ని ముక్కలు చేసి ఒక్కో ప్రాంతానికి ఒక్కో సామంత రాజుని పెట్టారని పేర్కొన్నారు.వైసీపీ ప్రభుత్వం బీసీలకు ఏం న్యాయం చేసిందో దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేసారు.
వైసీపీలో ఉన్న బీసీ నేతలు సీఎం వద్ద ఎందుకు మాట్లాడలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు.బీసీలకు ఏం చేశారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బీసీల నేతలు ప్రాంతాల వారీగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.







