అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని.గత కొద్ది నెలల నుండి రైతులు మహా పాదయాత్ర చేస్తూ ఉన్నారు.
ఈ క్రమంలో కోర్టు ఆదేశాలు మేరకు రైతులు గుర్తింపు కార్డులు చూపించాలని అనటంతో యాత్ర కొద్ది రోజులుగా వాయిదా పడటం జరిగింది.ఇలాంటి తరుణంలో రైతుల పాదయాత్ర విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యూహం పనిందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాహుల్ “భారత్ జోడో” పాదయాత్రకు లేని ఇబ్బంది… రైతుల పాదయాత్రకే ఎందుకని ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.ఈ క్రమంలో రైతులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు అన్యాయంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
న్యాయస్థానాలు మొట్టికాయలు వేసిన ప్రభుత్వానికి బుద్ధి రావటం లేదని అన్నారు.ఇదే సమయంలో వైసీపీ నేత విక్టర్ ప్రసాద్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
గాంధీని విమర్శిస్తే అభినవ గాంధీ అయిన మా ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటి అంటూ రఘురామకృష్ణరాజు వ్యంగ్యంగా విమర్శలు చేశారు.







