టాలీవుడ్ కుర్ర డైరెక్టర్ హరీష్ శంకర్ కొత్త టాలెంట్ నీ ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు.ఈ క్రమంలో వైవిద్యమైన కథనంతో సింగిల్ క్యారెక్టర్ లైన్ తీసుకుని “హలో మీరా” అనే కొత్త తరహా త్రిల్లింగ్ మూవీ టీజర్ నీ హరీష్ రిలీజ్ చేయడం జరిగింది.
ప్రముఖ దర్శకులు బాపు గారితో పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన కాకర్ల శ్రీనివాస్ ఈ సినిమాని తెరకెక్కించారు.భారీ తారాగణం లేకుండా ప్రయోగాత్మక స్టోరీతో ఈ సినిమాని రూపొందించారు.
ఈ సందర్భంగా దర్శకుడు హరిశంకర్ “హలో మీరా” టీజర్ రిలీజ్ చేసిన తర్వాత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
చాలా వైవిధ్యమైన స్టోరీతో మూవీ ఎంతో ఆసక్తికరంగా ఉందని.
టీజర్ బట్టి తెలుస్తుందని చెప్పారు.ఈ మేరకు సినిమా యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఒక నిమిషం 16 సెకండ్ల నిడివి కలిగిన “హలో మీరా” టీజర్ లో మీరా అనే సింగిల్ క్యారెక్టర్ లైన్ తో సినిమా తీసినట్లు తెలుస్తోంది.ఇష్టం లేని పెళ్లి నుండి మీరా అనే అమ్మాయి తప్పించుకోవడానికి రాత్రికి రాత్రి కారులో హైదరాబాద్ బయలుదేరడం.

ఈ క్రమంలో మీరాకి అనుకోని ఇబ్బందులు ఎదురు కావటం.వంటివి టీజర్ లో చూపించారు.సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో “హలో మీరా” చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
సినిమాలో మీరాగా… గార్గేయి యల్లాప్రగడ నటించడం జరిగింది.ఎస్ చిన్న సంగీతం అందించిన ఈ సినిమాని డాక్టర్ లక్ష్మణరావు దిక్కుల, వరప్రసాద రావు దుంపల, పద్మా కాకర్ల సినిమాని నిర్మించడం జరిగింది.







