యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందుతున్న సలార్ షూటింగ్ కార్యక్రమాలు తాజాగా ప్రారంభం అయ్యాయి.ఈ సినిమా ను మొదట ప్రారంభించిన సమయంలో కేవలం ఆరు నెలల సమయం లోనే పూర్తి చేసి 2022 సంవత్సరం జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామంటూ దర్శకుడు ప్రకటించాడు.
కానీ కరోనా ఇతర కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమైంది.దాంతో 2023 సంవత్సరం ప్రారంభంలో లేదా సమ్మర్ కానుకగా సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సమయం లో అనూహ్యం గా సినిమా ను వచ్చే సంవత్సరం చివరి లో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
![Telugu Prabhas, Prashanth Neel, Salar-Movie Telugu Prabhas, Prashanth Neel, Salar-Movie]( https://telugustop.com/wp-content/uploads/2022/10/shooting-tollywood-sruthi-hassan-ntr-prashanth-neel.jpg)
మరీ సెప్టెంబర్ వరకు ఏం చేస్తారంటూ దర్శకుడు ప్రశాంత్ పై ప్రభాసస్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.మరో వైపు దర్శకుడు ప్రశాంత్ వెంటనే ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సి ఉంది.అయినా కూడా సలార్ సినిమా ను చాన్నాళ్లు చేయాల్సిన అవసరం ఏంటి అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
ప్రభాస్ సినిమా వెంట వెంటనే పూర్తి చేసి తదుపరి సినిమా ను మొదలు పెట్టాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ మొదట భావించాడు.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా కోసం వచ్చే సంవత్సరం పూర్తిగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కేటాయించే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ విషయం లో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.ఈ సినిమా లో ప్రభాస్ కి జోడిగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
కేజీఎఫ్ సినిమా తో దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా తో మరింతగా పాపులారిటీని పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.