ఓటర్లకు జగన్ లేఖలు : వద్ధామనుకున్నా కానీ...?

బద్వేల్ ఉప ఎన్నికలలో గెలుపు ధీమా పై ఉన్న వైసిపి ఇక్కడ మెజారిటీ పైనే దృష్టి పెట్టింది.

ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ లు పోటీకి దూరంగా ఉన్నా, బీజేపీ తమ అభ్యర్థిని నిలబెట్టడంతో పోటీ అనివార్యమైంది.

అయితే ఈ రెండు పార్టీలు పోటీలు లేకపోయినా, టిడిపి జనసేన పార్టీలు బీజేపికి సహకరించే అవకాశం ఉండడంతో, మెజారిటీ తగ్గకుండా వైసీపీ ప్లాన్ చేసుకుంటుంది.ఈనెల 30వ తేదీన పోలింగ్ జరుగుతుండడం, నవంబర్ 2వ తేదీన ఫలితాలు వెల్లడి కాబోతున్న తరుణంలో ఇప్పటి నుంచే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వైసిపి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.

ఈ నెల 28వ తేదీన ఎన్నికల ప్రచారం ముగుస్తుండటంతో, కొంతమంది వైసీపీ కీలక నాయకులు ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.అయితే ఈ ప్రచారానికి వైసీపీ అధినేత జగన్ హాజరవుతారని ముందుగా అందరూ భావించినా, జగన్ మాత్రం అక్కడ ప్రచారానికి వచ్చే అవకాశం కనిపించడం లేదు.

పూర్తిగా ఈ ఎన్నికల బాధ్యతను జగన్ కు సన్నిహితుడైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూస్తున్నారు.నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాల వారీగా ఎమ్మెల్యేలకు, మంత్రులకు బాధ్యతలను అప్పగించారు.

Advertisement

గత మూడు రోజుల క్రితం చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల తో టిడిపి కాస్తోకూస్తో పుంజుకుంది అనే భావం లో ఉన్న జగన్ ఓటర్లు వైసిపి కి దూరం కాకుండా సరికొత్త రీతిలో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు.వాస్తవంగా బద్వేల్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని జగన్ భావించినా,ఎన్నికల సంఘం సభలకు అనుమతి ఇవ్వకపోవడం, నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాల్సి రావడం తదితర కారణాలతో జగన్ బద్వేలు నియోజకవర్గంలో ప్రచారానికి దూరంగా ఉన్నారు.

అయితే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల తరహాలోనే బద్వేల్ నియోజకవర్గ ఓటర్ల కు సైతం జగన్ లేఖలు రాశారు.మా కుటుంబ సభ్యులతో కలిసి గడిపి, భారీ బహిరంగ సభ ద్వారా మిమ్మల్ని ఓట్లు అడగాలి అని భావించానని, కానీ బద్వేల్ కు వస్తే భారీగా అక్క చెల్లెమ్మలు ఒక్కసారిగా గుమిగుడితే, వారిలో కొందరికైనా కోవిడ్ సోకే ప్రమాదం ఉందని, వారి కుటుంబ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తాను రావడం లేదని జగన్ ఆ లేఖలో వివరించారు.తమ పార్టీ అభ్యర్థి దాసరి సుధను భారీ మెజార్టీతో గెలిపించాలని జగన్ లేఖ ద్వారా ఓటర్లను కోరారు.

ఈ లేఖను ఇప్పుడు ప్రతి ఇంటికి వైసిపి నాయకులు అందిస్తూ, భారీ మెజార్టీ సాధించే దిశగా ముందుకు వెళ్తున్నారు.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు