ఢిల్లీలో కాదు గల్లికి రా జగన్ .. టిడిపి సవాల్ 

నిన్న ఢిల్లీలోని జంతర్ మంతర్( Jantar Mantar ) వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించిన వైసీపీ,  ఏపీలో కొత్తగా ఏర్పడిన టిడిపి,  జనసేన , బిజెపి( TDP, Jana Sena, BJP ) కూటమి పార్టీలు వైసీపీని టార్గెట్ చేసుకుంటూ అనేక దాడులకు దిగడం , ఏపీలో ఇప్పటికే చాలామంది వైసిపి కార్యకర్తలు హత్యకు గురికావడం, ఆస్తులు ధ్వంసం కావడం , వరుసగా కేసులు నమోదు అవుతుండడం తదితర పరిణామాలకు అడ్డుకట్ట వేసేందుకు జగన్ ( Jagan )ఢిల్లీలో పార్టీ నాయకులతో కలిసి ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చారు .

ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నేతలు హాజరై సంఘీభావం తెలిపారు.

  ఈ యాత్ర అనుకున్న మేరకు సక్సెస్ అయినట్టుగానే వైసిపి ప్రకటించింది.ఈ నేపథ్యంలోనే టిడిపి సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్తున్నారు.

రెండు రోజులు పాటు అక్కడే ఆయన ఉండబోతున్నారు.

ఇదిలా ఉంటే నిన్న నిర్వహించిన వైసిపి ధర్నా కార్యక్రమం పై టిడిపి కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చింది .ఈ మేరకు మంత్రి పయ్యావుల కేశవ్ ( Minister Payyavula Keshav )జగన్ కు సవాల్ విసిరారు .రెడ్ బుక్ అంటూ ఢిల్లీలో హడావిడి చేస్తున్న జగన్,  ఢిల్లీలో ధర్నా తో హడావుడి చేయడం కాదని,  ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ నడుస్తోంది వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలని సూచించారు.ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపిస్తున్న జగన్ కు మంచి అవకాశం దొరికింది.

Advertisement

అసెంబ్లీలో ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు ( CM Chandrababu Naidu ) శ్వేత పత్రం విడుదల చేస్తున్నారని, ఆ చర్చలో పాల్గొంటే రాష్ట్ర ప్రజలందరికీ అన్ని విషయాలు తెలుస్తాయని పయ్యావుల సూచించారు.

జగన్ ఢిల్లీకి ధర్నా చేయడానికి వెళ్లినట్టు లేదని ఇండియా కూటమిలో చేరేందుకు చర్చల కోసం వెళ్లినట్టు ఉందని పయ్యావుల కేశవ్ అన్నారు . ఢిల్లీలోనూ ఆయన్ను ఎవరూ పట్టించుకోలేదని,  జాతీయ మీడియాతో మాట్లాడడం తప్ప , అక్కడ ఒరిగిందేమీ లేదని విమర్శించారు.  ఇంకా అనేక అంశాలపై స్పందిస్తూ వైసిపి పైన,  జగన్ తీరు పైన పయ్యావుల విమర్శలు చేశారు.

Advertisement

తాజా వార్తలు