హమ్మయ్య ! జగన్ జనాల బాట పడుతున్నార్లే 

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నిత్యం జనాల్లో ఉంటూ, జనాల కష్టాలను తెలుసుకుంటూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, ఆ పార్టీ అధినాయకుడు జగన్ వ్యవహరించేవారు.

రాష్ట్రమంతా కాలి నడకన పర్యటించి, ప్రజల కష్టాలను, కన్నీళ్లను అన్నింటిని తెలుసుకుని , పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుచేసి చూపించారు.

కానీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ వైఖరి మారిపోయింది.పూర్తిగా ఆఫీస్ కే పరిమితం అయిపతున్నారు.

ఇటీవల జరిగిన పంచాయతీ , మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సైతం రాకుండా,  క్యాంపు కార్యాలయానికి పరిమితమయ్యారు.వ్యవహారాలను అధికారులు, పార్టీలోని కొంతమంది కీలక వ్యక్తులే చక్కబెడుతున్నారు.

ఏదైనా జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి చేయడం ఈ రెండేళ్లుగా జరుగుతూ వస్తోంది.అప్పుడప్పుడు మాత్రమే జగన్ బయటకు వస్తున్నారు తప్ప, ఎక్కువగా క్యాంపు కార్యాలయానికి పరిమితమై పోతున్నారు.

Advertisement

దీంతో పార్టీలోనూ ప్రజలను కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి అనే విషయం జగన్ వరకు వెళ్లడంతో, అతి త్వరలోనే జిల్లాల పర్యటనలు  చేయాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం.త్వరలోనే రెండేళ్ళు పూర్తి కాబోతున్న నేపథ్యంలో,  ఇక రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రజల సమస్యలు తెలుసుకుని , వాటికి పరిష్కార మార్గాలను వెతకాలి అని, పూర్తిగా వైసీపీ ప్రభుత్వం పై సంతృప్తి కలిగే విధంగా చేయాలనే పట్టుదలతో ఉన్నారట.

దీనికి సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ సైతం సిద్ధం కావడంతో రచ్చబండ కార్యక్రమం మొదలు కాబోతోంది.

  రాబోయే మూడేళ్ల పరిపాలన ఎలా ఉండాలి అనే విషయంతో పాటు, వైసీపీకి తప్ప ఏపీలో ఏ పార్టీ వైపు చూపు పడకుండా అన్ని విషయాలలోనూ పట్టు పెంచుకునే విధంగా జగన్ అడుగులు వేసేందుకు సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది.రచ్చబండ ద్వారానే ప్రభుత్వ పాలనలో లోటుపాట్లను తెలుసుకోవడంతో పాటు ,ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టే విధంగా జగన్ ప్లాన్ చేసుకుంటున్నారు.

కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు