మంత్రులందరూ మాజీలు కాబోతున్నారా ?  జగన్ లెక్కేంటి ?

ఏపీ సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు సంచలనంగానే ఉంటాయి.ప్రతిపక్షాలకు కాకుండా సొంత పార్టీ నేతలకు జగన్ నిర్ణయాలు షాక్ కలిగిస్తూ ఉంటాయి.

మొదటి నుంచి జగన్ ఇదే తరహా గా వ్యవహరిస్తూ వస్తున్నారు.ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా ఏపీ క్యాబినెట్ వ్యవహారం పదే పదే చర్చకు వస్తోంది.

ప్రస్తుతం ఉన్న మంత్రులలో దాదాపు 3 వంతుల మందిని తప్పించి, వారి స్థానంలో కొత్తవారిని నియమించబోతున్నారనే  ప్రచారం జరుగుతోంది.అయితే కొత్త మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కబోతోంది ? ఎవరెవరిని కొనసాగించబోతున్నారు అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.ఈ మేరకు మంత్రుల పనితీరు పై జగన్ ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా నివేదికలు తెప్పించుకున్నారు.

అయితే ఇప్పుడు జగన్ వేరే నిర్ణయం తీసుకున్నారట.మంత్రులలో కొంతమందిని తప్పించి మరికొంత మందిని కొనసాగిస్తే, మిగిలిన వారిలో అసంతృప్తులు తలెత్తుతాయని, అలాగే పెద్ద ఎత్తున మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న వారు చాలామంది ఉన్నారని , వారందరికీ న్యాయం చేయాలి అంటే పూర్తిగా ప్రస్తుతం ఉన్న మంత్రులందరినీ తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్లు గా గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

ప్రస్తుతం మంత్రులు పదవులు చేపట్టి ఈ నవంబర్ తో రెండున్నర సంవత్సరాలు అవుతుంది.దీంతో మొత్తం కేబినెట్ లో 25 మంది మంత్రులను తప్పించాలని జగన్ నిర్ణయించుకున్నారట.

అయితే వీరిలో ఎక్కడా అసంతృప్తి కలగకుండా, ఈ 25 మంది కి లోక్ సభ నియోజకవర్గాల ఇన్చార్జిలుగా నియమించే ఆలోచనలో జగన్ ఉన్నారట.

ఈ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలను వీరికే అప్పగించబోతున్నట్టు తెలుస్తోంది.అలాగే పార్టీ సీనియర్ నాయకులుగా, కీలక వ్యక్తులుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, బొత్స సత్యనారాయణ తో పాటు, మరికొంతమందికి అసంతృప్తి లేకుండా వారిని ఇన్చార్జిలుగా నియమించేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాల వారీగా జోన్ల ను విభజించి, వారికి బాధ్యతలు అప్పగించబోతున్నట్టు సమాచారం.

ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జిగా విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్నారు.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
పెళ్లి కొడుకే స్వయంగా మంత్రాలు చదువుతూ పూజారిగా మారాడు.. వీడియో చూస్తే అవాక్కవుతారు!

అదే విధంగా జోన్ల వారీగా ఇన్చార్జిలు పూర్తి బాధ్యత వహించబోతున్నారట.మొత్తం ఒక జోన్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలా అందరూ ఈ ఇంచార్జీల సూచనలతోనే ముందుకు వెళ్లే విధంగా ఆదేశాలు ఇచ్చారట.అయితే ఈ ఇన్చార్జిలకు రాజ్యాంగపరమైన ఎటువంటి హోదా లేకపోయినా, పార్టీలో కీలకమైన పదవులు గా వీటిని చూపించబోతున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు