టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీదేవి సోడా సెంటర్’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసేందుకు సుధీర్ బాబు రెడీ అవుతున్నాడు.
ఇక ఈ సినిమాలో లైటింగ్ సూరిబాబు పాత్ర పోస్టర్‌తోనే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా, సాంగ్స్, టీజర్లతో ఆ అంచనాలను అలానే మెయింటెయిన్ చేస్తూ వచ్చింది.ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
ఈ ట్రైలర్ చూస్తే ఈ సినిమాను మరో పూర్తి రొమాంటిక్ యాక్షన్ మూవీగా దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది.పలాస చిత్రంతో తనకు వచ్చిన గుర్తింపును ఏమాత్రం తగ్గకుండా చాలా జాగ్రత్త పడ్డాడు.
ఈ ట్రైలర్‌లో సుధీర్ బాబు విశ్వరూపాన్ని చూపించాడని చెప్పాలి.ముఖ్యంగా జైలుకు వెళ్లి వచ్చిన పాత్రలో అతడి పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఆనంది నటిస్తోండగా, గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో సాగే రొమాంటిక్ మూవీగా ఈ సినిమా నిలవనుంది.శ్రీదేవితో సూరిబాబు చేసే రొమాంటిక్ ట్రాక్ ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేయనుందని ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
ఇక ఈ సినిమా మెయిన్ కథను ఈ ట్రైలర్‌లోనే చూపించేశారు చిత్ర యూనిట్.కులం పేరుతో ప్రేమికులను విడదీసేందుకు సాగే యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను దర్శకుడు కరుణ కుమార్ పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కించాడని రుజువయ్యింది.
ఆగస్టు 27న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.మరి శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ సాలిడ్‌గా పేలడంతో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను రాబడుతుందా అనే ఆసక్తి ఇప్పుడు ప్రేక్షకుల్లో నెలకొంది.