ఏపీలో రాజకీయ పరిస్థితులు మారాయి.2019 ఎన్నికల సమయంలో పరిస్థితి ఒక విధంగా ఉంది.2019 ముందు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో జనాల్లో ఉన్న అసంతృప్తి ఓట్ల రూపంలో జగన్ కు మేలు చేసింది.రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీయడంతో 175 నియోజకవర్గాలకు గాను, వైసిపి 150 స్థానాల్లో అధికారంలోకి వచ్చింది.
టిడిపి కేవలం 23 స్థానాలకే పరిమితం అయిపోయింది.వైసీపీ తరఫున నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఎవరు అనేది పక్కన పెడితే , జగన్ ను చూసి ఓటు వేసిన వారే ఎక్కువ.
జగన్ పాదయాత్ర ద్వారా జనాల్లో బలం పెంచుకోవడం, అప్పటి టిడిపి ప్రభుత్వం పై పెరిగిన అసంతృప్తి ఇవన్నీ వైసీపీకి బాగా కలిసి వచ్చాయి.అయితే ఇప్పుడు పరిస్థితి వేరేగా ఉంది.
2019 మాదిరిగా వైసిపి కి 2024 లో ఉండదు.జగన్ ఎంత సంక్షేమ పథకాలు అమలు చేసినా, ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగానే ఉంటుంది.
దీంతో 2024 ఎన్నికల్లో జగన్ చరిష్మా కంటే ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను చూసి ఓటు వేసే అవకాశం ఎక్కువ .ఈ విషయాన్ని జగన్ సైతం గుర్తించారు.అందుకే 2014 ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను సగం మంది వరకు మార్చి వారి స్థానాల్లో స్థానికంగా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న వారిని వైసిపి అభ్యర్థులుగా నిలబెడితేనే ఫలితం సానుకూలంగా ఉంటుందనే అభిప్రాయానికి జగన్ వచ్చేశారట.దీనికి తోడు వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ ఇప్పటికీ ఏపీలో నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు జగన్ కు రిపోర్టులు అందిస్తుండడం, క్షేత్రస్థాయిలో అభిప్రాయం ఏ విధంగా ఉంది అనే విషయాలను పీకే టీమ్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రిపోర్టులు అందిస్తూ ఉండడంతో, జగన్ అలర్ట్ అవుతున్నారు.

ఎంతగా ప్రభుత్వ పథకాలను, పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నా, స్థానికంగా నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు, జరిగిన అభివృద్ధి ఇవన్నీ ఎన్నికల సమయంలో ప్రభావం చూపిస్తాయి అనే విషయాన్ని జగన్ గుర్తించారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల పై అసంతృప్తి వైసిపికి ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉందని జగన్ గ్రహించడంతో నే దాదాపు సగం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల ను తప్పించి ఆ స్థానంలో ప్రజాదరణ కలిగిన బలమైన నేతలను అభ్యర్థులుగా ప్రకటించాలని జగన్ డిసైడ్ అయినట్టు గా తెలుస్తోంది.
.