కరోనా వల్ల అనాధలైన పిల్లల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. !

ప్రకృతి కన్నెర్ర చేస్తే ఒక గ్రామం, లేదా ఒక రాష్ట్రం మాత్రమే నష్టపోతుంది.కానీ కరోనా వల్ల ప్రపంచమే కఠిన పరీక్షలు ఎదుర్కొంటుంది.

 Ap Govt To Make Rs 10 Lakh Fixed Deposit For Children Orphaned In Pandemic, Ap G-TeluguStop.com

ఈ వైరస్ ఎన్నో ఆనందాలను దూరం చేస్తూ, లెక్కలేని కుటుంబాలను అనాధలుగా చేసి రోడ్దున పడవేస్తుంది.

ముఖ్యంగా తల్లిదండ్రులను ఈ కరోనా యుద్ధంలో కోల్పోయిన పిల్ల పరిస్దితులు ఊహించడానికి కూడా మనస్సు రాదు.

మరి ఇలాంటి అనాధలను ఆదుకునే వారు ఎవరు.అయిన వారు ఒక నెల వరకు చూస్తారు.

ఆ తర్వాత వారు ఎదుర్కొనే కష్టాలు పగవారికి కూడా రాకూడదు.

అందుకే ఇలాంటి వారి విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.కరోనా వల్ల కన్న వారిని కోల్పోయి అనాథ‌లైన చిన్నారుల పేరు పై రూ.10‌ లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిటివ్ చేయాల‌నే ఉత్త‌ర్వులు రేప‌టిలోగా విడుద‌ల చేయ‌నుందట జగన్ ప్ర‌భుత్వం.అంతే కాదు ఇలాంటి పిల్లలకు 20 ఏళ్లు నిండిన త‌ర్వాత ఎఫ్‌డీ మొత్తాన్ని అందించేలా ప్లాన్ చేస్తున్న‌ట్టుగా, అప్పటి వరకు ఈ మొత్తంపై వ‌చ్చే వ‌డ్డీని ఆ చిన్నారులు నెల‌నెల తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.ఇక ఈ పధకం వల్ల అనాధలైన పిల్లలకు భరోసా లభిస్తుందని ప్రభుత్వం ఆశిస్తుందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube