2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) ఇచ్చిన హామీలలో సిపిఎస్ రద్దు కూడా ఒకటి తాము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేయిస్తామని, దాని గురించి ఎలాంటి బెంగా అవసరంలేదని ఎంతో హుందాగా పెరోషియస్ గా చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి.ఆ హామీతో ఉద్యోగస్తులు మూకుమ్మడిగా గంపగుత్తున్న వైసీపీకి ఓటు వేశారు.
అయితే ఆ తరువాత సీన్ మొత్తం మారిపోయింది.అనుకున్నట్లుగానే జగన్ అధికారంలోకి వచ్చినప్పటికి సిపిఎస్ రద్దు హామీ జరగకపోగా ఎదిగో అదిగో అంటూ ఎప్పటికప్పుడు ఆ హామీ వాయిదా పడుతూనే వచ్చింది.

దీంతో ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతు వచ్చింది.ఎన్నోమార్లు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాధికారులతో చర్చలు జరిపినప్పటికి పెద్దగా స్పందించలేదు.అయితే ఎట్టకేలకు ఈ ఏడాది జూన్ లో సిపిఎస్ ను రద్దు చేస్తూ దాని స్థానంలో జీపీఎస్ ను తీసుకొచ్చింది జగన్ సర్కార్.ఉద్యోగులు రిటైర్డ్ అయ్యే నాటికి వున్న బేసిక్ శాలరిలో 50 శాతం పెన్షన్ గా చెల్లించేందుకు అంగీకరిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
అయితే ఈ జిపిఎస్ పై కూడా చాలా మంది ఉద్యోగుల్లో అసంతృప్తి ఉంది.గతంలో ఇచ్చిన ఓపిఎస్ ను అమలు చేయకపోగా.జిపిఎస్ పేరుతో మోసపూరిత విధానాన్ని తీసుకొచ్చారని ఉద్యోగ సంఘాలు మండి పడుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ( AP Employees )తీసుకుంటున్న నిర్ణయాలు జగన్ సర్కార్ ను ఇబ్బంది పెట్టెల కనిపిస్తున్నాయి.డిసెంబర్ 10 నుంచి ఆత్మ గౌరవ సభ పేరుతో ఉద్యోగ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిస్తున్నాయి.దీంతో గత ఎన్నికల ముందు వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులు ఈసారి ఎన్నికలు వచ్చేసరికి.
వైసీపీకి కొరకరాని కొయ్యగా మారారు.ఈసారి ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధించాలని టార్గెట్ గా ఉన్న వైసీపీని ఉద్యోగుల నుంచి ఎదురయ్యే వ్యతిరేకత గట్టిగానే దెబ్బ తీసే అవకాశం ఉంది.
మరి ఉద్యోగుల విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్రణాళికలతో ముందుకు సాగుతారో చూడాలి.