ఏపీకి బై బై చెబుతున్న పరిశ్రమలు.. పార్లమెంటులో పరువు పాయె..!

వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నప్పటికీ వారిలో అభివృద్ధి పథంలో నడవాలన్న సంకల్పం ఏ మాత్రం కనిపించడం లేదు.

సంక్షేమ పథకాలకు కోట్లాది కోట్ల డబ్బులు కుమ్మరించారు కానీ అదేవిధంగా ఆదాయం సృష్టించడంలో మాత్రం సమూలంగా విఫలమయ్యారు.

ఇక ఆదాయం పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోకపోగా ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన వైసిపి సర్కారు కాస్తా ఉన్న పరిశ్రమలనే రాష్ట్రం నుండి తరిమేస్తున్న వార్తలు రోజు చూస్తూనే ఉన్నాం.ఇక జగన్ పాలనలో అమర్ రాజా సంస్థకు జరిగిన అవమానం ఎవరూ మర్చిపోరు.

పరిశ్రమలను ప్రోత్సహిస్తూ ఉద్యోగాలను సృష్టిస్తూ పన్నులు, ఆదాయాల ద్వారా ఖజానా నింపుకొని అవసరమైనప్పుడు రాయితీలు ఇవ్వాల్సిన ప్రభుత్వం పైకి ఏమో పేదల కోసం ఏదో మేలు చేస్తున్నట్లు వెన్నపూస్తున్నారు.పేదవారికి ఖచ్చితమైన ఉద్యోగాలు, జీవనోపాధి కల్పించాల్సిన కర్తవ్యాన్ని విస్మరించి మటన్ షాపులు, చేపల మార్కెట్లు, పానీపూరి వంటి చిరు వ్యాపారాలు చేసుకోవాలని చెప్పి చేతులు దులుపుకుంటుంది.

ఒక్క భారీ పరిశ్రమ పెడితే ఏకకాలంలో వేల మందికి ప్రత్యక్ష పరచ ఉపాధ్యాయ అవకాశాలు లభిస్తాయి అన్న చిన్న విషయం కూడా వైసిపి నేతలకు తెలియదా అంటూ పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు.ఇక పెట్టుబడులను పెట్టేందుకు వచ్చినవారిని మన మంత్రులు భారీ స్థాయిలో వాటాలు, కమీషన్లు అడుగుతూ వారిని భయపెట్టి పంపించేస్తున్నారట.

Advertisement

ఇక కేంద్ర ప్రభుత్వం తాజాగా పరిశ్రమల విషయంలో జగన్ ప్రభుత్వం చేతకానితనాన్ని నేరుగా ఎండ కట్టింది.విదేశీ పెట్టుబడును ఆకర్షించడంలో ఏపీ పూర్తిగా విఫలమైందని స్పష్టంగా విమర్శిస్తూ ఈ ఏడాది జనవరి నుండి సెప్టెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన విదేశీ పెట్టుబడుల శాతం 0.5% అని నిగ్గు తేల్చింది.ఇక దేశవ్యాప్తంగా ఎఫ్డిఐ పొందిన రాష్ట్రాల్లో ఏపీ పదో స్థానంలో ఉంది.

ఈ తొమ్మిది నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ కు కేవలం 217 మిలియన్ డాలర్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి.ఈ విషయం పార్లమెంటులో పెద్ద చర్చకు దారి తీసింది.

మొదటి స్థానంలో మహారాష్ట్ర తర్వాత కర్ణాటక, ఢిల్లీ ఉండగా మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణ 1287 మిలియన్ డాలర్లతో ఏడవ స్థానంలో నిలిచింది.ఇక ఏపీకి తెలంగాణకి మధ్య దాదాపు 1000 మిలియన్ డాలర్ల వ్యత్యాసం ఉండడం గమనార్హం.

దీనిని బట్టి మన జగన్ ప్రభుత్వం ఎంత భేషుగ్గా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 
Advertisement

తాజా వార్తలు