ఈ మాటలు అంటున్నది ప్రత్యర్ధులో టిడిపి నాయకులో కాదు, ఇది అంటున్నది సాక్షాత్ జగన్ పార్టీ నేతలే.ఎన్నికల్లో ఓడిపోవడంతో అసహనానికి గురైన జగన్ కొంత కాలం పాటు మీడియాకి దూరంగా ఉండి సమీక్షలు, సమావేశాలతో బిజీ గా ఉండి పోయాడు.
ఈ మద్య కాలంలో పార్టీనుండి ఎన్నుకోబడిన కొంతమంది నాయకులు ఇతర పార్టీల్లోకి మారడంతో పార్టీని పునర్వ్యవస్తికరించెందుకు మళ్ళి కార్యకర్తలని కలవడానికి జిల్లా యాత్రలు మొదలుపెట్టాడు.తను సమీక్షలు చేస్తున్నప్పుడు కొంత మంది ముక్యమైన నాయకులని వ్యక్తిగతంగా పిలిచి వారి సమస్యలు వింటూ తగిన సలహాలు ఇస్తూ పార్టీని నడిపించడానికి కావాల్సిన సలహాలు సేకరిస్తున్నాడని లోకల్ నాయకులూ చెబుతున్నారు.
కాని ఈ సమీక్షలు చేస్తున్నప్పుడు కొంతమందిని నమ్మలేక తన అనుచరగణాన్నివారిపై నిఘా పెడుతూ వారి యొక్క ఆలోచనలని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని సమాచారం.దీని గురుంచి తెలిసిన వైకాపా శ్రేణులు నాయకుడ ఇలా అపనమ్మకంతో ఉండకూడదని గుసగుసలు చేస్తున్నారని సమాచారం.