ప్రస్తుత పరిణామాలు చూస్తే ఇదే నిజం అనిపించేలా ఏపీలో చోటు చేసుకుంటున్న వ్యవహారాలు ఉన్నాయి.2019 ఎన్నికల్లో వైసిపి 151 సీట్లతో అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.ఇక అప్పటినుంచి జగన్ మేనిఫెస్టోలోని హామీలను అమలు చేస్తూ అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, తమకు రాబోయే ఎన్నికల్లో తిరుగులేకుండా చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే పూర్తిగా సంక్షేమ పథకాలపైనే దృష్టి సారించడం, అభివృద్ధి కార్యక్రమాలను పక్కనపెట్టి ఏపీ లో ఆదాయ వనరులతో పాటు, కొత్తగా అప్పులు చేస్తూ సంక్షేమ పథకాలకి సొమ్ములు ఖర్చు పెడుతున్న తీరు మొదట్లో సమంజసమే అన్నట్లుగా కనిపించినా, రాను రాను అప్పులు చేస్తూ ఏపీ ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా జగన్ వేల కోట్లు సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతుండడం వంటివి సామాన్య వర్గాలతో పాటు, ఉద్యోగస్తులలోను వ్యతిరేకత పెంచుతోంది.
ఇప్పటికే వివిధ శాఖలకు సంబంధించిన నిధులను సంక్షేమ పథకాలకు ఖర్చుపెడుతున్న తీరును కోర్టులు సైతం తప్పు పట్టాయి.ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ టౌన్షిప్ లను నిర్మించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
స్మార్ట్ టౌన్ షిప్ లను ఏర్పాటు చేయాలని, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేయాలని జగన్ ప్రభుత్వం భావించింది.ఈ మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే లేఅవుట్లు వేయడమే కాకుండా, దీనికి ఎంపిక చేసిన నగరాలలో టౌన్షిప్ ల నిర్మాణం కోసం ప్రజల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులను ఆహ్వానించింది.
అయితే దీనికి ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు.

తమకు ఫ్లాట్లు కావాలని అప్లికేషన్లు వచ్చినా, దానికి సంబంధించిన పది శాతం ముందుగా చెల్లించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.దరఖాస్తు చేసే సమయంలో 10% మొత్తాన్ని చెల్లించాలి తర్వాత 30% చెల్లించడం, ఆరు నెలల తర్వాత మరో 30% శాతం , చివరిగా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ సమయంలో 30% చెల్లించే విధంగా ఏపీ ప్రభుత్వం విధానాలను రూపొందించింది.ఆ సొమ్మును ప్లాట్ల కోసం కాకుండా ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఖర్చు పెడితే తమ చేతికి ఫ్లాట్ అందుతుందో లేదో అన్నా అనుమానమూ జనాల్లో కలగడంతో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన స్మార్ట్ టౌన్ షిప్ ప్రాజెక్టు పెద్దగా జనాల ఆదరణ పోవడానికి కారణంగా తెలుస్తోంది.







