బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నాయి.ఇలా బుల్లితెరపై మల్లెమాల వారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు ప్రచారం అవుతూ అద్భుతమైన రేటింగ్ సంపాదించుకుంటున్నాయి.
అయితే ఈ మధ్యకాలంలో మల్లెమాల వారి కార్యక్రమాలకు రేటింగ్ అమాంతం పడిపోవడంతో ఈ కార్యక్రమ రేటింగ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఈ ప్రయత్నాల వల్ల పెద్ద ఎత్తున నెటిజన్ ల ఆగ్రహానికి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఈ క్రమంలోనే బుల్లితెరపై ప్రసారమవుతున్న డాన్సింగ్ షో ఢీ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తుంది.
అయితే ఈ మధ్యకాలంలో ఈ కార్యక్రమానికి కూడా పెద్దగా ఆదరణ లేదని చెప్పాలి.వచ్చేవారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా వేదికపై హీరోయిన్ శ్రద్ధదాస్ కి అవమానం జరిగినట్టు తెలుస్తుంది.ఢీ 14లో బాయ్స్ టీమ్ కి మెంటర్ గా వ్యవహరిస్తున్నటువంటి ఫ్రాంక్ స్టార్ కిరణ్, శ్రద్ధాదాస్ పట్ల అవమానకరంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
కొరియోగ్రాఫర్ స్పెషల్ రౌండులో భాగంగా ఒక పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత శ్రద్ధాదాస్ వెళ్లి ఆ కంటెస్టెంట్లతో కలిసి డాన్స్ చేస్తుంది.

ఈ విషయంపై కిరణ్ మాట్లాడుతూ శ్రద్ధాదాస్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని అందుకే తను వాళ్ళ వైపు మాట్లాడుతూ వాళ్ళతో కలిసి డాన్స్ చేస్తుంది అంటూ తనని దారుణంగా అవమానించారు.ఇలా పక్షపాతంగా వ్యవహరిస్తూ వాళ్లకి ఎక్కువ మార్కులు ఇస్తే మా పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు.ఇలా ఈ విషయం గురించి ఇరువురి మధ్య పరస్పరం మాటల యుద్ధం చోటుచేసుకుంది ఇలా వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో ఫ్రాంక్ స్టార్ కిరణ్ ను సెట్ లో నుంచి బయటకు తీసుకెళ్లినట్టు చూపించారు.
మరి ఈ గొడవ నిజంగానే జరిగిందా లేదంటే ఇది ప్రోమో కోసం ఇలా కట్ చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.







