బాబు, జగన్ కాంప్రమైజ్ పాలిటిక్స్: మెడలు వంచేసారా..?

బీజేపీ విషయంలో జగన్, చంద్రబాబులు ఒకే దారిలో వెళుతున్నారా.రాష్ట్ర సమస్యలపై నోరు విప్పితే మోడీ నుంచి ఏమన్నా ఇబ్బందులు వస్తాయని కాంప్రమైజ్ అయిపోయారా ? అంటే ఏపీలో ప్రస్తుతం పరిస్థితులని చూస్తే నిజమే అనిపిస్తోంది.

గత ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న జగన్, ప్రత్యేక హోదా కోసం ఓ రేంజ్‌లో గళం విప్పారు.25 ఎంపీ సీట్లు ఇవ్వండి కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానని అన్నారు.జ‌గ‌న్‌కు ఏపీ ప్ర‌జ‌లు ఏకంగా 22 ఎంపీ సీట్లు క‌ట్ట‌బెట్టారు.

ఇక బాబు కూడా నాలుగేళ్ళు బీజేపీతో చెట్టపట్టాలేసుకుని తిరిగి ఎన్నికల చివరి ఏడాది బీజేపీతో ఓడిపోయి, ధర్మపోరాట దీక్షలు అని చెప్పి మోడీని తెగ తిట్టారు.అయితే ఎన్నికల్లో ఫలితాలు బాబుకు వ్యతిరేకంగా వచ్చాయి.

జగన్ భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చేశారు.అటు కేంద్రంలో మోడీ కూడా మ్యాజిక్ ఫిగర్ దాటి సీట్లు తెచ్చుకుని రెండోసారి అధికారంలోకి వచ్చారు.

దీంతో హోదా విషయంలో ఇటు జగన్ గానీ, అటు బాబు గానీ చేతులెత్తేశారు.

Advertisement

కేంద్రంలో మోడీకి మంచి మెజారిటీ ఉండటంతో జగన్, బాబులు హోదాని పక్కనబెట్టేశారు.ఎప్పటికప్పుడు బీజేపీతో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నారు గానీ, రాష్ట్రానికి రావాల్సిన హామీలపై కేంద్రాన్ని నిలదీసే కార్యక్రమం చేయడం లేదు.అయితే తాజాగా మాత్రం బీజేపీని డిమాండ్ చేసే మంచి అవకాశం ఒకటి దొరికింది.

రాజ్యసభలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేని విషయం తెలిసిందే.తాజాగా డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరిగింది.

ఇక ఈ ఎన్నికలో గెలవడానికి బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు.అయితే వైసీపీకి 6 గురు, టీడీపీకి ఇద్దరు రాజ్యసభ్యుల బలం ఉంది.

ఈ 8 మంది బలం బీజేపీకి ఎంతో అవసరం ఇలాంటి సమయంలో జగన్, బాబు గానీ బీజేపీపై ఎలాంటి ఒత్తిడి పెంచకుండా, కాంప్రమైజ్ అయిపోయి, భేషరతుగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో ఎన్డీయేకు సపోర్ట్ ఇచ్చారు.దీని బట్టి చూసుకుంటే బీజేపీ దగ్గరే జగన్, బాబులు మెడలు వంచేశారని అర్ధం చేసుకోవచ్చు.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు