టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
వకీల్ సాబ్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ ప్రస్తుతం చేతినిండా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు.
ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.ఏఎమ్ రత్నం సినిమాను నిర్మిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమాలోని ఒక పాత్రకు మొదట బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ను ఎంపిక చేశారు.
తాజాగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఒక కేసు విషయంలో ఈడి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసు విషయంలో జాక్వెలిన్ సమస్యలలో చిక్కుకుంది.ఇందులో భాగంగా ఈడి అధికారులు దేశం విడిచి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు.
ఈ కారణం చేత జాక్వెలిన్‌ను పవన్ సినిమా నుంచి తొలగించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలపై దర్శకుడు క్రిష్ స్పందించి ఆ వార్తల్లో నిజం లేదు అంటూ కొట్టిపడేశారు.
అంతేకాకుండా డేట్స్ ఇష్యూ వల్ల జాక్వలిన్ ఫెర్నాండెజ్ మా సినిమా చేయలేకపోయింది.
డేట్స్ ను సర్దుబాటు చేయడం ఆమెకు కష్టమైపోయింది.

అందువల్లే గత ఏడాదే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది.జాక్వెలిన్ స్థానంలో మేము నర్గిస్ ఫక్రిని ఎంపిక చేశాము.జాక్వెలిన్ ఇప్పుడు వార్తల్లో నిలిచేసరికి అనవసరంగా మా సినిమా ప్రస్తావన తీసుకొస్తున్నారు అని క్రిష్ తెలిపారు.హరి హర వీర మల్లు సినిమాలో మొఘల్ సామ్రాజ్యానికి చెందిన రోషనార పాత్రలో నర్గిస్ ఫక్రి కనిపించనుంది.
ఆమెకు ఈ లుక్ చాలా అందంగా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో 17వ శతాబ్దపు కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది.