వాచ్ మేన్ కుటుంబానికి సాయం చేసిన జబర్దస్త్ వర్ష.. ఆమె మంచి మనస్సుకు ఫిదా అంటూ?

దేశంలో చాలామంది దగ్గర అవసరానికి మించిన డబ్బు ఉన్నా సహాయం చేసే గుణం మాత్రం కొంతమందికే ఉంది.

అలా సహాయం చేసే మంచి మనస్సు ఉన్నవాళ్లలో జబర్దస్త్ వర్షకూడా ఒకరు.

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి వర్ష ( varsha )చెప్పుకొచ్చారు.సీరియళ్లు, సినిమాల ద్వారా కెరీర్ ను మొదలుపెట్టిన వర్ష జబర్దస్త్ కామెడీ షో( Jabardast Comedy Show ) ద్వారా పాపులర్ అయ్యారు.

ఈ షో అంచనాలను మించి సక్సెస్ సాధించడంతో పాటు అదిరిపోయే రేటింగ్ లను సొంతం చేసుకుంది.వర్ష ఇమ్మాన్యుయేల్ జోడికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.

ఈ జోడీ పెళ్లి చేసుకుని సంతోషంగా జీవనం సాగించాలని కోరుకునే ఫ్యాన్స్ సంఖ్య తక్కువేం కాదు.త్వరలో బిగ్ బాస్ షోలో( Bigg Boss show ) ఎంట్రీ ఇవ్వనున్న వర్ష ఈ షో సైతం తన కెరీర్ ను మలుపు తిప్పుతుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

Advertisement

సరైన అవకాశాలు వస్తే గ్లామర్ గా కనిపించడానికి సైతం సిద్ధమేనని వర్ష చెప్పకనే చెబుతున్నారు.మా వాచ్ మేన్( Watch man ) కు ఇద్దరు కొడుకులు అని ఆ ఇద్దరు కొడుకులలో ఒక కొడుకును చదివిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.వాచ్ మేన్ స్థోమత లేక ఒక కొడుకునే చదివిస్తున్నారని తెలిసి ఎంత ఖర్చైనా మరో కొడుకును నేను చదివిస్తానని వాచ్ మేన్ కు నేను మాటిచ్చానని ఇచ్చిన మాట ప్రకారం చదివిస్తున్నానని వర్ష అన్నారు.

బన్నీకి లవర్ గా చేయాలని ఉందని రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లకు సిస్టర్ గా చేయాలని ఉందని వర్ష చెప్పుకొచ్చారు.ఫ్యాన్స్ తనను జూనియర్ సమంత అని పిలుస్తారని కామెంట్లు చేశారు.నా సంపాదనలో కొంత మొత్తాన్ని నా వంతు సహాయం చేస్తున్నానని వర్ష పేర్కొన్నారు.

వర్ష వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతుండగా వర్ష బిగ్ బాస్ సీజన్7 విజేతగా నిలవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 
Advertisement

తాజా వార్తలు