జబర్దస్త్ లేడీ కమెడియన్ సత్య శ్రీ గురించి మనందరికీ తెలిసిందే.ఈమె ఎక్కువగా చమ్మక్ చంద్ర స్కిట్ లలో కనిపిస్తూ ఉంటుంది.
మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఆన్ స్క్రీన్ పై చమ్మక్ చంద్ర భార్యగా ఎన్నో స్కిట్ల లో నటించి బాగా ఫేమస్ అయింది సత్య శ్రీ.అయితే చమ్మక్ చంద్ర జబర్దస్త్ నుంచి బయటకు రావడంతో, తన గురువు జాడలోనే నడుస్తూ బయటకు వచ్చేసింది సత్య శ్రీ.
చమ్మక్ చంద్ర తనకు గురువు వంటి వాడని, అతను వెళ్లిపోవడంతోనే తాను కూడా వెళ్లానని సత్య శ్రీ తెలిపింది.
ఇదిలా ఉంటే తాజాగా సత్య శ్రీ తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఈ క్రమంలోనే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఘటన గురించి చెప్పుకొచ్చింది.సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో తాను నటించానని, ఓ రోజు సెట్‌లో ఓ సీన్ చేయడం తనకు అంతగా నచ్చలేదని, కంఫర్ట్‌గా అనిపించక పోవడంతో ఆ సీన్, సాంగ్ ఏదోలా అనిపించిందని తాను చేయనని అక్కడి టీంకు చెప్పిందట.
అయితే చివరకు పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లగా మొదట సత్య శ్రీ అమ్మాయిని పిలవండని కబురు పెట్టారట.
దీంతో పవన్ కళ్యాణ్ వద్దకు సత్య శ్రీ వెళ్లిందట.నీ పేరు ఏంటి? అని అడిగాడట పవన్ కళ్యాణ్.సత్య అని చెప్పడంతో.
ఎక్కడి నుంచి వచ్చావ్ అని అడిగగా తణుకు నుంచి అని సమాధానం ఇచ్చిందట.సీన్ చేయమంటే చేయనని అన్నావట.చేయవా? అని పవన్ కళ్యాణ్ అడిగాట.చేయను సర్ అని సత్య చెప్పడంతో.
పవన్ కళ్యాణ్ గట్టిగా నవ్వేశాడట.సరే వెళ్లు.
మంచి నటివి అవ్వు అని చెప్పేశాడట.అక్కడ ఓ అమ్మాయి పడుతున్న బాధను పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు.
అందుకే నాకు ఆయనంటే ఇష్టమని సత్య శ్రీ ఎంతో గొప్పగా చెప్పేసింది.