తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్( Comedian Avinash ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ జబర్దస్త్ షో ( Jabardasth )ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ముక్కు అవినాష్ కూడా ఒకరు.
అయితే అవి నాకు బిగ్ బాస్ నుంచి ఆఫర్ రావడంతో జబర్దస్త్ షోకి గుడ్ బాయ్ చెప్పేసి మల్లెమాల నుంచి బయటకు వచ్చేసాడు.ఇక ప్రస్తుతం మీకు అవినాష్ శ్రీదేవి డ్రామా కంపెనీ అలాగే స్టార్ మా లో ప్రసారమయ్యే స్టార్ మా విత్ పరివార్స్ లాంటి షోలలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు.
ఇది ఇలా ఉంటే తాజాగా అవినాష్ తల్లి మల్లమ్మ తీవ్ర అస్వస్థకు లోనయ్యారు.
గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లమ్మను( Mallamma ) తాజాగా ఆసుపత్రికి తీసుకెళ్లగా గుండెపోటు వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు.
గుండెలో బ్లాక్స్ ఉండటంతో వైద్యులు స్టంట్స్ వేశారు.ఈ మేరకు అవినాశ్ తన యూట్యూబ్ ఛానల్‌లో ఒక వీడియోని విడుదల చేసాడు.ఎప్పుడూ నవ్వుతూ ఉండే అమ్మ ఇలా ఇబ్బందిపడటం చూడలేకపోతున్నాను.తను ముందు నుంచే షుగర్ వ్యాధితో బాధపడుతోంది.
ఈ షుగర్ వల్ల నచ్చిన ఫుడ్ కూడా తినలేకపోతోంది.ఈ మధ్యే అమ్మకు గుండెపోటు వచ్చింది.
తనను ఊరిలో ఆస్పత్రికి తీసుకెళ్తే అమ్మ గుండె వీక్ ఉందన్నారు.
అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడే ఒక ఆస్పత్రిలో చూపించాను.గుండెలో రెండు పెద్ద బ్లాక్స్ ఏర్పడ్డాయి.ఆంజియోగ్రామ్ చేయించాము.
రెండు స్టంట్స్ వేయించాము.తనను ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పుకొచ్చాడు అవినాష్.
అయితే తనకు వచ్చిన పరిస్థితిని తలుచుకుని అవినాశ్ తల్లి( Avinash Mother ) కన్నీటిపర్యంతమైంది.నా కొడుకులు బతికించారు, అందుకే బతికినా.
జరగబోయేది నాకు తెల్వదు.
మీ దయ వల్ల మంచిగుండి డ్యాన్స్ చేశిన, అన్నీ చేశిన.నాకిప్పుడు ఈ కష్టం వచ్చింది.మీరు లేకుంటే బతకలేను, నా పెద్ద కొడుకు లేకపోయుంటే ఊరిలోనే నా ప్రాణం పోయేది.
వాడు తొందరగా నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించడం వల్లే బతికి ఉన్నాను అంటూ ఏడ్చేసింది.కొడుకుని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయింది మల్లమ్మ. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.