జబర్దస్త్ లో సంపాదించిందంతా అక్కడ పోయిందా.. కెవ్వు కార్తీక్ కన్నీటి కష్టాలు?

నవ్వించడం అనేది ఒక కళ.అది అందరికీ సాధ్యం కాదు.

 Jabardasth Comedian Kevvu Karthik Face Financial Problems Jabardasth, Kevvu Kart-TeluguStop.com

నలుగుర్ని నవ్విస్తూ వినోదాన్ని పంచుతూ ప్రేక్షకుల పొట్ట చెక్కలు చేసే ఈ కమెడియన్ కష్టం వెనుక ఓ కన్నీటి గాథ ఉంది.ఆయనే కెవ్వు కార్తిక్.

జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోతో అందర్నీ నవ్విస్తూ ప్రేక్షకులను నవ్వించే కెవ్వు కార్తీక్.పొట్ట కూటి కోసం చాలా తిప్పలే పడ్డారు.

చాలామంది జబర్దస్త్ కమెడియన్ల మాదిరిగానే కెవ్వు కార్తీక్ కూడా తన రియల్ లైఫ్‌లో చాలా ఇబ్బందులు పడ్డారు.ఒక్కో మెట్టూ ఎక్కుతూ పైకి వస్తున్న కార్తిక్, తన గతాన్ని.

తాను పడ్డ కష్టాన్ని ఒక ఇంటర్వ్యూలో ఇలా తెలియజేశారు.

తన తల్లి క్యాన్సర్ తో బాధ పడుతున్నపుడు ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు పడ్డట్టు ఆయన తెలిపారు.

ఆ టైంలో కొన్ని ఈవెంట్స్ ని కూడా మిస్ చేసుకున్నా.కానీ అప్పుడు నేనున్న ఈ పరిస్థితులలో డబ్బు నాకు చాలా అవసరం.అప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నానని ఆయన అన్నారు.ఈవెంట్ లో భాగంగా నేను ఆస్ట్రేలియా వెళ్ళినపుడు ఒక డాక్టర్ నీ కలిశాను.

వాళ్ళు అయితే కీమో థెరపీ చేయాలని చెప్పారు.ఇక్కడ డాక్టర్స్ కూడా అదే చెప్పారు.

కానీ దానికి బెటర్ ఆప్షన్ ఇంకేమైనా దొరుకుతుందేమో అని ఎదురు చూస్తున్నట్టు కార్తిక్ తెలిపారు.డాక్టర్ చెప్పిన దాని ప్రకారం ఇక కీమో థెరపీ చేయాలని డిసైడ్ అయ్యామని ఈ విషయాలు నాకు తెలిసిన కొంత మందికే చెప్పానని ఆయన తెలిపారు.

Telugu Mother, Exra Jabardasth, Jabardasth, Kevvu Karthik, Show-Movie

ఇక ఆ ట్రీట్మెంట్ కి వారానికి దాదాపుగా 65 వేలు ఖర్చు అయ్యేదని కార్తీక అన్నారు.అలా ఒక 4 కీమోలు అయ్యేసరికి అమ్మకు జుట్టు రాలిపోవడం స్టార్ట్ అయింది.అది చూసి అమ్మ ఏంటిది ఎందుకు ఇలా అవుతుంది అంటే.లేదమ్మా ఈ ట్రీట్మెంట్ వల్ల కొంచం వీక్ అవుతుంది.

అదే కాకుండా ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుందని, ఇది చాలా చిన్నదని తనకు నిజం చెప్పలేదని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు.

Telugu Mother, Exra Jabardasth, Jabardasth, Kevvu Karthik, Show-Movie

అలా 4, 5 కీమోలు అయ్యేసరికి అమ్మ చాలా వీక్ అయ్యిందని, అది చూస్తుంటే దగ్గర్నుంచి నరకాన్ని చూస్తున్నట్టు ఉండేదని కార్తిక్ తెలిపారు.జబర్దస్త్ లో అందరూ ఇప్పటి వరకు వచ్చిన సంపాదనతో మంచిగా ఇల్లు, కారు కొనుక్కొని సెటిల్ అయ్యారు.నేను కూడా అలా కూడబెట్టుకుని ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అనుకున్నా.

కానీ జబర్దస్త్ లో సంపాదించినది మొత్తం ఆ సమయంలోనే అమ్మకు ఇలా అవడం వల్ల ఖర్చు అయిపోయిందని కెవ్వు కార్తిక్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube