అతని ఆరోగ్యంపై హైపర్ ఆది పంచులు.. వైరల్ అవుతున్న వీడియో!

హైపర్ ఆది అంటేనే పంచ్ డైలాగులు.పంచ్ డైలాగ్ అంటేనే హైపర్ ఆది అని చెప్పవచ్చు.

నిమిష నిమిషానికి, మాటమాటకి పంచులు వేస్తూ తనదైన శైలిలో ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు.జబర్దస్త్ ద్వారా హైపర్ ఆది తన పంచ్ డైలాగులతో ఎంతో ఫేమస్ అయ్యారు.

ఈ క్రమంలోనే సినిమా అవకాశాలను కూడా దక్కించుకున్నారు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో ఫేమస్ అయిన హైపర్ ఆది ఈటీవీలో ప్రసారమయ్యే "శ్రీదేవి డ్రామా కంపెనీలో" కూడా స్కిట్ల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ ఆదివారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది.ఆటో రాంప్రసాద్.సుడిగాలి సుదీర్ ముగ్గురు బిచ్చగాళ్ళ గెటప్ లో దర్శనమిచ్చారు.

ఈ క్రమంలోనే ప్లేట్లో చేతులు పట్టుకుని కూర్చోగా బ్యాక్ గ్రౌండ్ ఒక్కపూట అన్నం కోసం అనే పాటను ప్లే చేసారు.ఈ విధంగా బెగ్గర్స్ గెటప్లో ఉన్న వీళ్ళని చూస్తూ స్టేజ్ పైకి వచ్చిన పంచ్ ప్రసాద్ వీరితో ఇలా మాట్లాడాడు.

ఏంటయ్యా మీరు బెగ్గర్స్ అని అడగగా.అందుకు హైపర్ ఆది అవునండి.మీ ఆపరేషన్ కోసం డబ్బులు కలెక్ట్ చేస్తున్నామంటూ పంచ్ వేశాడు.

కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చిన ప్రసాద్ ను చూసి ఇంజక్షన్ లకు అవసరమయ్యే డబ్బులు వచ్చాయని అంటాడు.ఇంకొక అరగంట ఆగితే ఆపరేషన్ సక్సెస్ అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ నవ్వులు కురిపించారు.అయితే జబర్దస్త్ కమెడియన్ అయినటువంటి పంచ్ ప్రసాద్ గత కొద్దిరోజుల నుంచి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సంగతి మనకు తెలిసిందే.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్స్ అందరూ అతనికి సహాయం చేసి అతనిని బతికించారు.

Advertisement

అనారోగ్యం నుంచి కోలుకున్న పంచ్ ప్రసాద్ తిరిగి జబర్దస్త్ వేదికపై కనిపించారు.అయినప్పటికీ కొన్ని సార్లు అతని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్న నేపథ్యంలో కమెడియన్స్ అతని ఆరోగ్యంపై కూడా ఈ విధంగా పంచులు వేస్తూ స్కిట్ లలో నవ్వులు కురిపిస్తున్నారు.ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తాజా వార్తలు