జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న కమెడియన్లలో అప్పారావు ఒకరనే సంగతి తెలిసిందే.ఈ షో వల్ల అప్పారావుకు చాలా సినిమాలలో ఆఫర్లు కూడా వచ్చాయి.
అయితే గత కొన్ని నెలలుగా అప్పారావు జబర్దస్త్ షోలో కనిపించడం లేదు.ఈ షోలో కనిపించకపోవడానికి గల కారణాలను వెల్లడిస్తూ తాజాగా అప్పారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
జబర్దస్త్ షో తనకు లైఫ్ ఇచ్చిందని అప్పారావు అన్నారు.
జబర్దస్త్ లాంటి షోను ఎవరూ సాధారణంగా వదులుకోరని నాకంటే ముందు నాగబాబు ఆ షోను వదులుకున్నారని అప్పారావు తెలిపారు.
మనం దేనిని నమ్ముకున్నామో దేనిని ఇష్టపడ్డామో దానిని వదులుకోవాలంటే ముఖ్యమైన కారణం ఉంటుందని అప్పారావు అన్నారు.నేను జబర్దస్త్ లో ప్రాక్టీస్ కు, ఎపిసోడ్ కు ఒక్కరోజు కూడా మానేయలేదని లైఫ్ ఇచ్చినందుకు జబర్దస్త్ కు అంత ప్రాధాన్యత ఇచ్చానని అప్పారావు తెలిపారు.
రెండు రోజులు ప్రాక్టీస్, రెండు రోజులు షూటింగ్ ఉంటుందని ఆ షో అంటే సినిమా రిలీజైనంత ఆనందం అని అప్పారావు అన్నారు.

కరోనా సెకండ్ వేవ్ తర్వాత తన ఏజ్ ఎక్కువ కావడంతో రిస్క్ ఎక్కువని మేనేజ్ మెంట్ కొన్నిరోజులు ఆగమన్నారని బుల్లెట్ భాస్కర్ తనతో చెప్పాడని అప్పారావు చెప్పుకొచ్చారు.ఆ సమయంలో తాను ఆ మాటలు నమ్మానని అప్పారావు వెల్లడించారు.

భాస్కర్ దగ్గర చేసిన స్కిట్స్ లో క్రమంగా ప్రాధాన్యత తగ్గుతూ వచ్చిందని అలా పరోక్షంగా అవమానించారని ఆయన అన్నారు.నేను సీనియర్, స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా ప్రాధాన్యత తగ్గించారని ఆయన తెలిపారు.30 ఏళ్ల నుంచి నేను స్టేజ్ ఆర్టిస్ట్ నని ఆయన తెలిపారు.ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ టీమ్ లో చేయనని తాను చెప్పానని అప్పారావు అన్నారు.ఆ తర్వాత తాను నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కావాలని అడిగితే వాళ్లు వెంటనే ఇచ్చారని అప్పారావు తెలిపారు.
అయితే ఎందుకు షోకు దూరమవుతున్నానని కూడా వాళ్లు అడగకపోవడంతో ఫీలయ్యానని అప్పారావు చెప్పుకొచ్చారు.