వేదికపై గొడవపడిన జబర్దస్త్ యాంకర్స్... బయటపడిన విభేదాలు?

జబర్దస్త్ యాంకర్స్ గా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి రష్మీ, సౌమ్య రావు గురించి పరిచయం అవసరం లేదు.జబర్దస్త్ యాంకర్ గా సీరియల్ నటి సౌమ్యరావు అవకాశం అందుకున్నారు.

 Jabardasth Anchors Clashed On Stage Differences That Emerged , Jabardasth Anchor-TeluguStop.com

ఇక రష్మీ ముందు నుంచి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.అయితే అనసూయ వెళ్ళిపోవడంతో రష్మీ కొంతకాలం పాటు జబర్దస్త్ కార్యక్రమానికి కూడా యాంకర్ గా వ్యవహరించి సౌమ్య రావు ఎంట్రీ ఇవ్వడం తో ఈ కార్యక్రమం నుంచి తప్పకున్నారు.

ఇకపోతే తాజాగా ఈ ఇద్దరి యాంకర్స్ మధ్య ఓ విషయంలో చిన్నపాటి గొడవ తలెత్తినట్టు తెలుస్తోంది.

వీరిద్దరూ జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్లుగా కొనసాగుతూ ఉండగా… జబర్దస్త్ యాంకర్ ఎవరు అనే విషయం గురించి మనస్పర్ధలు వచ్చినట్టు తెలుస్తోంది.

దీంతో ఈ ఇద్దరు ఏకంగా వేదికపై నువ్వా నేనా అంటూ పెద్ద ఎత్తున గొడవ పడ్డారు. శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమంలో సౌమ్యరావు సందడి చేశారు.

అక్కడికి సౌమ్య రావు ఎంట్రీ ఇవ్వడంతో రష్మీ మాట్లాడుతూ కొత్త యాంకర్ రావడంతో వెళ్లిపోవడానికి నేను ఆ పాత ముగ్గురు యాంకర్స్ అనుకున్నావా అంటూ మాట్లాడుతుంది.దీంతో సౌమ్య రావు ముగ్గురు కాదు నలుగురు అంటూ సౌమ్య రష్మీ పై సెటైర్ వేస్తుంది.

ఈ క్రమంలోనే వీరిద్దరూ నువ్వు గొప్ప నేను గొప్ప అంటూ గొడవకు దిగడంతో వెంటనే ఇంద్రజ జోక్యం చేసుకొని జబర్దస్త్ టీం తరఫున సౌమ్యరావు ఎక్స్ట్రా జబర్దస్త్ టీం తరపున రష్మీ వీరిద్దరూ ఎవరు తనని బ్రష్ చేస్తే వాళ్లే జబర్దస్త్ యాంకర్ అని చెప్పడంతో వీరిద్దరూ నువ్వా నేనా అని పోటీ పడుతూ పెద్ద ఎత్తున పర్ఫామెన్స్ చేసినట్టు తెలుస్తోంది.ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube