తెలుగు బుల్లితెర పై ప్రతి గురు శుక్రవారాలలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను నవ్విస్తున్న షో జబర్దస్త్. ఈ జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు మంచి గుర్తింపును సంపాదించుకున్న విషయం తెలిసిందే.
జబర్దస్త్ షో ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకొని సినిమాలలో సైతం అవకాశాలను అందుకుంటు దూసుకుపోతున్నారు.జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న వారిలో కమెడియన్ ఆటో రాంప్రసాద్ కూడా ఒకరు.
రాంప్రసాద్ అంటే చాలామంది గుర్తుపెట్టుకపోవచ్చు కానీ జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు.
తన ఆటో పంచులతో ప్రేక్షకులను కడుపున నవ్విస్తూ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు రాంప్రసాద్.
ఇక ఆటో రాంప్రసాద్, సుడిగాలి సుధీర్,గెటప్ శీను వీరి ముగ్గురు మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే.వీరు ముగ్గురు కలిసి సినిమాను కూడా చేశారు.కాగా వీరిలో గెటప్ శీను, సుడిగాలి సుధీర్ సినిమాలలో చిన్న చిన్న పాత్రలో నటించినప్పటికీ రాంప్రసాద్ కేవలం బుల్లితెరకు మాత్రమే పరిమితం అయ్యాడు.కాగా సుధీర్ హీరోగా నటించిన గాలోడు సినిమా ఇటీవల విడుదల అయ్యి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్ సమయంలో రామ్ ప్రసాద్ కనిపించలేదు.
అంతే కాకుండా ఇటీవల జరిగిన గాలోడు మూవీ ఈవెంట్ లో స్టేజ్ పైనే రామ్ ప్రసాద్ కు ఫోన్ చేయగా ఆయన సుధీర్ కు ఆల్ ది బెస్ట్ తెలిపాడు.దీంతో రాంప్రసాద్ అభిమానులు రాంప్రసాద్ కి ఏమయింది ఎందుకు ఈవెంట్ కి రావడం లేదు అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ కలిసి ఉన్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
అందులో రామ్ ప్రసాద్ తలకు ఏందో కవర్ తొడుక్కొని కనిపించాడు.దాంతో అతని తలకు ఎదో సర్జరీ అయ్యిందని తెలుస్తోంది.అయితే ఆ సర్జరీ దేనికి సంబంధించి అన్నది మాత్రం తెలియడం లేదు.గెటప్ శ్రీను మాట్లాడుతూ.
రాంప్రసాద్ హెడ్ కి సర్జరీ చేయించుకోవడం వల్ల సుధీర్ సినిమా ఈవెంట్స్ కు రాలేకపోయాడు అని తెలిపిన విషయం తెలిసిందే.