ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఫిట్ నెస్ కోసం చాలా శ్రమిస్తున్నారు.ఒకప్పుడు ఫిట్ నెస్ గురించి పెద్దగా పట్టించుకునే వారు కాదు కానీ ప్రస్తుతం మాత్రం ఫిట్ నెస్ అంటే ఎంత ఖర్చయినా చేస్తున్నారు.
ఎటువంటి వస్తువులైనా వాడుతున్నారు.ఇలాంటి వ్యక్తుల ఆలోచనను ఆసరాగా చేసుకునే చాలా మంది ఫిట్ నెస్ పేరు చెప్పి వేల కోట్ల రూపాయలను దండుకుంటున్నారు.
ఫిట్ నెస్ వస్తుందని చెబితే ఎంత ఖర్చయినా సరే చేసేందుకు సిద్ధంగా ఉంటున్నారు.ఇలాంటి వ్యక్తులు నేటి రోజుల్లో కోకొల్లలుగా కనిపిస్తున్నారు.
ఫిట్ నెస్ వస్తుందంటే చాలు ఎటువంటి పనయినా సరే చేస్తున్నారు.ఆ పని చేయడం వలన ఆరోగ్యం దెబ్బతింటుందా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అని ఏ మాత్రం ఆలోచించడం లేదు.జిమ్స్ కూడా నేటి రోజుల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.వీటిల్లో చేరేందుకు కొంత మంది చాలా ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు.
జిమ్ లో చేరిన మొదటి రోజు తర్వాత ఒక్క రోజుకే వారికి కండలు తిరిగిన దేహం వచ్చినట్లు చాలా మంది ఫీలవుతుంటారు.వారు వ్యవహరించే తీరు చూస్తే ఇది మనకు సింపుల్ గా అర్థమవుతుంది.
ఇలాగే సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కూడా ఒక కోడి తాను జిమ్ కు పోయిన వ్యక్తిలా పోజ్ కొడుతుంది.ఆ కోడిని చూస్తే అచ్చంగా మొదటి రోజు జిమ్ కు పోయిన వారు ఎలా అయితే ప్రవర్తిస్తారో అలాగే ఉంది.
మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరూ ఈ కోడి వీడియోను చూసేయండి.సరదాగా నవ్వుకోండి.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇప్పటికే 500K మెంబర్స్ ఈ వీడియోను తిలకించారు.
అంతే కాకుండా ఈ వీడియోను తిలకించిన వారు ఫన్నీ కామెంట్లు కూడా చేస్తున్నారు.