Bandla Ganesh Pawan Kalyan : జీవితంలో అది ఎప్పటికీ జరగని పని.. బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్!

బండ్ల గణేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన వివాదాలకు కూడా కేంద్ర బిందువుగా ఉంటారు.

ఇలా తరచూ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కు భక్తుడు అనే విషయం మనకు తెలిసిందే.

పవన్ కళ్యాణ్ ను ఎవరైనా ఏమైనా అంటే వారికి తనదైన స్టైల్ లో కౌంటర్ ఇస్తూ ఉంటాడు బండ్ల గణేష్.ఇలా పవన్ భక్తుడిగా ఎప్పటికప్పుడు తనపై అభిమానాన్ని చూపుకుంటున్న బండ్ల గణేష్ తాజాగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే.

పవన్ కళ్యాణ్ సుజిత్ సినిమా గురించి బండ్ల గణేష్ మాట్లాడుతూ వరాలు ఇచ్చే గుడికి వెళ్దాం.ప్రసాదాలు తిందాం లేకపోతే టైం వేస్ట్ టైం ఎక్కువ లేదు మన ఫ్యామిలీకి ప్రాముఖ్యత ఇవ్వాలి అంటూ బండ్ల గణేష్ చేసినటువంటి ఈ ట్వీట్ వైరల్ కావడమే కాకుండా పలు అనుమానాలకు కారణమైంది.

ఈ క్రమంలోనే కొందరు ఈ ట్వీట్ పై స్పందిస్తూ గతంలో పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ తో సినిమా చేస్తానని మాట ఇచ్చారు.అయితే పవన్ కళ్యాణ్ తనకు సినిమా చేయకుండా వేరొకరికి అవకాశం ఇవ్వడంతోనే హర్ట్ అయ్యి ఇలాంటి కామెంట్స్ చేశారనే వార్తలు పుట్టుకొచ్చాయి.

Advertisement

ఇక ఈ వార్త రాసిన ఓ మీడియా లింక్ ను బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.జీవితంలో పవన్ కళ్యాణ్ గారిపై హర్ట్ అవడం అనేది ఎప్పటికీ జరగదు, నా బాస్ పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటా అని క్లారిటీ ఇచ్చారు.ఈ విధంగా బండ్ల గణేష్ తన గురించి వస్తున్న వార్తలపై స్పందించి క్లారిటీ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్ కు మధ్య ఎలాంటి అభిప్రాయ బేధాలు లేవని, మరోసారి బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ భక్తుడని నిరూపించుకున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు