Android phone screen lock: ఆండ్రాయిడ్ ఫోన్‌కు వేసిన స్క్రీన్ లాక్ తీసేయడం ఇంత సులువా.. వామ్మో

మన ఫోన్లలో ప్రైవేట్ సమాచారం ఇతరులకు తెలియకుండా ఉండేందుకు స్క్రీన్ లాక్ పెట్టుకుంటాం.కొందరు ఫేస్ రికగ్నిషన్, ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ రికగ్నిషన్ పెట్టుకుంటారు.

 Its So Easy To Remove Screen Lock On Android Phone Details, Android, App, Techno-TeluguStop.com

అయితే స్క్రీన్ లాక్‌ ప్యాట్రన్ మనకు మాత్రమే తెలిసేలా పెట్టుకున్నది ఇతరులు తీయడం అంత సులువు కాదు.ఇటీవల ఆశ్చర్యకర పరిణామం జరిగింది.

స్మార్ట్ ఫోన్ స్క్రీన్ లాక్‌ను ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చాలా సులువుగా తీసేశాడు.దీంతో స్క్రీన్ లాక్ ద్వారా మన ఫోన్లు చాలా భద్రంగా ఉన్నాయనుకున్న అందరూ ఈ పరిణామంతో ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

ప్రస్తుతం అన్ని చోట్ల సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ స్క్రీన్ లాక్ భద్రతపై సందేహాలు నెలకొన్నాయి.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

గూగుల్ పిక్సెల్ ఫోన్లు అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు.వీటిలో సెక్యూరిటీ ఫీచర్లు చాలా బాగుంటాయి.

ఇటీవల Google Pixel ఫోన్‌ల పాస్‌కోడ్ తెలియకుండా ఎవరైనా అన్‌లాక్ చేయడానికి గూగుల్ ఓ పోటీ నిర్వహించింది.

అందులో “యాక్సిడెంటల్” సెక్యూరిటీ బగ్‌ను ప్రైవేట్‌గా తెలిపిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌కు 70,000 యూఎస్ డాలర్లు చెల్లించింది.

ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చాలా సులువుగా పాస్ కోడ్ తెలియకుండానే ఫోనల్ అన్‌లాక్ చేశాడు.హంగేరీకి చెందిన పరిశోధకుడు డేవిడ్ షుట్జ్ దీనిపై స్పందించారు.బగ్‌ను ఉపయోగించుకోవడం చాలా సులభం అని తెలిపారు.ఈ సమస్యను సరిచేయడానికి గూగుల్‌కు ఐదు నెలలు పట్టింది.

గూగుల్ పిక్సెల్ ఫోన్‌కు ఎవరైనా తమ స్వంత SIM కార్డ్‌లో మార్పిడి చేసుకోవచ్చు.ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క లాక్ స్క్రీన్ సెక్యూరిటీ తెలుసుకోవడానికి దాని ప్రీసెట్ రికవరీ కోడ్‌ను నమోదు చేయవచ్చు.

Telugu Android, Androidphone, David Shutz, Latest, Lock, Car Puk, Ups-Latest New

Android లాక్ స్క్రీన్‌లు వినియోగదారులు తమ ఫోన్ డేటాను రక్షించుకోవడానికి నంబర్ పాస్‌కోడ్, పాస్‌వర్డ్ లేదా నమూనాను లేదా వేలిముద్ర లేదా ఫేస్ ప్రింట్‌ను సెట్ చేయడానికి అనుమతిస్తాయి.మీ ఫోన్ నంబర్‌ను బయటకు పంపకుండా మరియు భౌతికంగా దొంగిలించకుండా దొంగను నిరోధించడానికి మీ ఫోన్ SIM కార్డ్‌లో ప్రత్యేక PIN కోడ్ కూడా సెట్ చేయబడి ఉండవచ్చు.అయితే వినియోగదారు PIN కోడ్‌ను మూడు సార్లు కంటే ఎక్కువసార్లు తప్పుగా నమోదు చేస్తే SIM కార్డ్‌ని రీసెట్ చేయడానికి SIM కార్డ్‌లు అదనపు వ్యక్తిగత అన్‌లాకింగ్ కోడ్ లేదా PUKని కలిగి ఉంటాయి.

Telugu Android, Androidphone, David Shutz, Latest, Lock, Car Puk, Ups-Latest New

PUK కోడ్‌లను పరికర యజమానులు పొందడం చాలా సులభం, తరచుగా SIM కార్డ్ ప్యాకేజింగ్‌లో లేదా నేరుగా సెల్ క్యారియర్ కస్టమర్ సేవ నుండి ముద్రించబడుతుంది.ఇలా సెక్యూరిటీ బగ్‌ను కనిపెట్టి గూగుల్ నుంచి భారీగా నజరానాను ఆయన అందుకున్నాడు.అయితే ఈ సమస్య కేవలం గూగుల్ పిక్సెల్ ఫోన్లకే ఉందని, సాంసంగ్ స్మార్ట్ ఫోన్లకు లేదని తెలుస్తోంది.

దీంతో స్మార్ట్ ఫోన్ యూజర్లు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube