ఐటెం సాంగ్‌ ఏంట్రా ‘పింక్‌’ను అంతా కంపు చేస్తున్నారా?

బాలీవుడ్‌లో హిట్‌ అయిన పింక్‌ సినిమాను తెలుగులో పవన్‌ హీరోగా ‘వకీల్‌ సాబ్‌’గా రీమేక్‌ చేస్తున్నారు.వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

లేడీ ఓరియంటెడ్‌ చిత్రం అవ్వడంతో పాటు మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రం ఇది.పింక్‌ విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఎన్నో అవార్డులు మరియు రివార్డులు దక్కించుకుంది.అందుకే పింక్‌ రీమేక్‌ను ఉన్నది ఉన్నట్లుగా తీస్తేనే బాగుంటుందని అంతా అంటున్నారు.

తమిళంలో పింక్‌ రీమేక్‌ను అజిత్‌ చేశాడు.కనీసం 5 శాతం కూడా మార్చకుండా ఉన్నది ఉన్నట్లుగా తెరకెక్కించాడు.సక్సెస్‌ పొందాడు.

కాని వకీల్‌ సాబ్‌ కోసం పింక్‌ను చాలా మార్చుతున్నట్లుగా సమాచారం అందుతోంది.సినిమాలోని మెయిన్‌ పాయింట్‌ను కంటిన్యూ చేస్తూ దాదాపుగా 30 శాతం స్క్రీన్‌ప్లేను మార్చుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

Advertisement

సినిమాకు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కావాలనే ఉద్దేశ్యంతో పవన్‌ కళ్యాణ్‌ను హీరోయిజంతో చూపించడంతో పాటు మరింత మాస్‌ ఎలిమెంట్స్‌ కోసం ఐటెం సాంగ్‌ను కూడా పెట్టబోతున్నట్లుగా చెబుతున్నారు.ఇలియానాతో ఒక ప్రత్యేక పాటను చేయించాలని మేకర్స్‌ భావిస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రం అయిన పింక్‌ రీమేక్‌ వకీల్‌ సాబ్‌లో ఐటెం సాంగ్‌ ఏంట్రా బాబోయ్‌ అంటూ కొందరు జుట్టు పీక్కుంటున్నారు.మేలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు