ఐటీ దాడులు జరుగుతాయని ముందే తెలుసు..: మాజీ ఎంపీ పొంగులేటి

ఐటీ దాడులపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.దాదాపు ఎనిమిది గంటలకు పైగా ఆయన ఇంటితో పాటు పార్టీ కార్యాలయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

 It Was Already Known That It Attacks Would Happen..: Former Mp Ponguleti-TeluguStop.com

ఐటీ దాడులు జరుగుతాయని తనకు ముందే తెలుసని పొంగులేటి అన్నారు.తన మీద, మువ్వ విజయబాబు మీద వేధింపులు ప్రారంభించారన్నారు.

రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్ నేతల ఇళ్లపైనే దాడులు సాగుతున్నాయని ఆరోపించారు.బీజేపీతో సీఎం కేసీఆర్ కుమ్మక్కయ్యారని తెలిపారు.

బీజేపీలోకి వెళ్లలేదని, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చానని కుట్రపూరితంగా తనిఖీలు నిర్వహిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.ఈ క్రమంలోనే బీజేపీ నుంచి సున్నితమైన వార్నింగ్ లు కూడా వచ్చాయన్నారు.

అయితే తనను జైల్లో పెట్టినా వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పిన పొంగులేటి రాజ్యాంగపరంగా పోరాడుతానని తెలిపారు.తనను నామినేషన్ వేయకుండా చేస్తే ఈసీకి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube