పెళ్ళాం, పిల్లలు లేరు.. సల్మాన్ ఖాన్ ది హ్యాపీ లైఫ్?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోహీరోయిన్లుగా కొనసాగుతున్నప్పటికీ వారందరికీ ఎన్నో తలనొప్పులు ఉన్నాయని చెప్పవచ్చు.

పెళ్ళాం పిల్లలు విడాకులు ఆస్తి తగాదాలు ఇలా ఎన్నో గొడవలు ఉన్నాయి.

అయితే అందరి స్టార్ హీరోల కన్నా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుత కాలానికి తన లైఫ్ ని ఎంతో ఆనందంగా సంతోషంగా గడుపుతున్నారని చెప్పవచ్చు.తన జీవితంలో ఎలాంటి ఆస్తి గొడవలు, విడాకుల తలనొప్పులు, పిల్లల పెంపకం వంటి ఇబ్బందులు లేకుండా స్టార్ హీరోగా పేరు సంపాదించుకొని తన లైఫ్ హ్యాపీగా గడుపుతున్నారు.

సల్మాన్ ఖాన్ అనుభవించడానికి కోట్లకొద్దీ ఆస్తి ఉంది, పిల్లలతో గడపడానికి తన సోదరుల పిల్లలు మేనల్లుళ్ళు ఎంతోమంది ఉన్నారు.ఇక సల్మాన్ ఖాన్ కు మాజీ గర్ల్ ఫ్రెండ్స్ గురించి చెప్పాల్సిన పని లేదు.

అంతా స్టార్ హీరోయిన్లు, అందానికి నిర్వ‌చ‌నం లాంటి అతివ‌లే.అయితే వారందరితో తనకు ఏ విధమైనటువంటి సంబంధం ఉందో తెలియదు కానీ మొత్తానికి సల్మాన్ ఖాన్ మాత్రం తన జీవితాన్ని ఎంతో ప్రశాంతంగా గడుపుతున్నారు.

Advertisement

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలు విడాకులతో బాధపడుతుండగా స్టార్ హీరో షారుక్ ఖాన్ తన కొడుకు వల్ల ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారు.ఇక స్టార్ హీరో హీరోయిన్స్ విషయాల గురించి బయట పెట్టడానికి సోషల్ మీడియా ఒకటి చాలు.వారి గురించి ఒక కామెంట్ చేసిన పెద్దఎత్తున ఎన్నో వివాదాలకు కారణం అవుతున్నాయి.

అయితే సల్మాన్ ఖాన్ మాత్రం ఇందుకు భిన్నం అని చెప్పవచ్చు.ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కు ఇలాంటి తల నొప్పులు రావడానికి అతనికి పెళ్ళాం, పిల్లలు లేరు కనుక తన జీవితంలో ఎంతో హ్యాపీగా గడుపుతున్నారని చెప్పవచ్చు.

ఇక సినిమాల విషయానికొస్తే సల్లుభాయ్ కత్రినాకైఫ్ టైగర్ 3 సినిమా చేస్తుండగా సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ సీజన్ 15 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు