చైనీస్ యాప్స్‌కి మ‌రో షాక్ ఇచ్చిన భారత్ ...!

ఇక చైనా-భారత్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పరిస్థితుల మధ్య, అలాగే దేశ ప్రజల సమాచారానికి సంబంధించిన విషయంలో సంబంధించిన మొత్తం 59 యాప్స్ ను కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

అయితే ఇందుకు సంబంధించి సదరు అప్లికేషన్ ఉపయోగించే వ్యక్తి యొక్క లొకేషన్ అలాగే అతనికి సంబంధించి డేటా పూర్తి వివరాలను పూర్తిగా మూడు వారాల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా 59 అప్లికేషన్స్ యజమానులకు భారతదేశ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేఖలు రాసింది.

భారతదేశంలోనే ఐటీ యాక్ట్ కింద సదరు సంస్థలకి ఈ-మెయిల్స్ పంపించామని తద్వారా పూర్తిగా విశ్లేషించడానికి వీలుగా ఉంటుందని ఐటీ అధికారి ఒకరు తెలియజేశారు.భారతదేశ ప్రజల డేట్స్ తో సహా వారి లొకేషన్ యొక్క వివరాలను చైనా సర్వర్లకు బదిలీ చేస్తున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సూచించడంతో ఇలాంటి నిర్ణయం తీసుకుంది.

కొత్తగా వీటితోపాటు బ్యూటీ ప్లస్, సెల్ఫీ కెమెరా లాంటి వాటిలో కూడా అశ్లీలత ఎక్కువ ఉంటుందని కేంద్రానికి నివేదిక అందింది.అయితే చైనీస్ యాప్స్ పై విధించిన నిషేధాన్ని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ డిజిటల్ స్ట్రైక్ గా అభివర్ణించారు.

అయితే అతి త్వరలోనే ఆ యాప్స్ కు సంబంధించిన యజమానులు ప్యానల్ కు ముందు హాజరు కావాల్సి ఉంటుందని తెలియజేశారు.

Advertisement

ఇకపోతే షార్ట్ వీడియో ప్లాట్ ఫామ్ కు సంబంధించిన టిక్ టాక్ కు భారతదేశంలో ఏకంగా 200 మిలియన్ల పైగానే యూజర్లు ఉన్నారు.ఇందుకు సంబంధించి టిక్ టాక్ యాజమాన్యం తాము భారతదేశం నిబంధనలకు లోబడే ఉన్నామని వినియోగ డేటా, అలాగే వారి గోప్యత వంటి విషయాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఆ సంస్థ ప్రతినిధి తెలియజేశారు.అలాగే నిర్ణీత సమయంలో పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన తెలిపారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు