వనపర్తిలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇందిరమ్మ రాజ్యంపై కేసీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.వనపర్తిలో పాఠశాలలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు.
ఇందిరమ్మ రాజ్యంలోనే నాగార్జునసాగర్ కట్టారన్నారు.అలాగే ఇందిరమ్మ రాజ్యంలోనే శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులను కూడా కట్టారన్న విషయాన్ని గుర్తు చేశారు.
ఈ క్రమంలోనే పాలమూరు అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని సూచించారు.