డీజీ లాకర్ ఉంటే చాలు., ఇక ఆ సర్టిఫికెట్ ఉన్నట్లే..!

ఒకప్పుడు ముఖ్యమైన పేపర్లను వెంట తీసుకుపోవడం మర్చిపోవడం తరువాత ఇబ్బందులు పడడం చూసాము.

కానీ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో ఏ ఒక్క పేపర్ ను కూడా క్యారీ చేయాల్సిన అవసరం లేదు.

అందుకే డిజిటల్ డాక్యుమెంట్లను స్టోర్ చేసుకోవడానికి, సులువుగా మేనేజ్ చేయడానికి డిజిలాకర్ అప్లికేషన్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది.ముఖ్యమైన డాక్యుమెంట్స్ అన్నీ ఒకే చోట భద్రపరచుకోవడానికి డిజిలాకర్ ఉపయోగపడుతుంది.

ఏదైనా పని కోసం సులువుగా డాక్యుమెంట్ ను యాక్సెస్ చేసుకోవచ్చు.అంతేకాకుండా యాప్ ద్వారా ఇప్పుడు పెన్షన్ సర్టిఫికేట్ ను కూడా పొందవచ్చు.

ఈ సేవలను తాజాగా ప్రారంభించింది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.పెన్షన్ సర్టిఫికేట్ విషయంలో వృద్ధులకు సహాయం చేయడానికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తాజా సేవలను డిజిలాకర్ ద్వారా ప్రారంభించింది.

Advertisement

ఇప్పుడు డిజిలాకర్ ద్వారా పెన్షన్ సర్టిఫికేట్ పొందడానికి.ముందుగా వెబ్సైట్ లో లాగిన్ చేయాలి.

లేదా స్మార్ట్ఫోన్ లో డిజిలాకర్ యాప్ ఓపెన్ చేయాలి.అనంతరం 6 అంకెల సెక్యూరిటీ పిన్ తో పాటు ఆధార్ నంబర్ లేదా రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ ను ఎంటర్ చేసి సైన్-ఇన్ చేయాలి.

ఆ తర్వాత మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీ (OTP) ని ఎంటర్ చేయాలి.అక్కడ పెన్షన్ డాక్యుమెంట్ అని టైప్ చేసిన తర్వాత మల్టిపుల్ ఆప్షన్లు కనిపిస్తాయి.

అందులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సెలక్ట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక చిన్న ఫారమ్ కనిపిస్తుంది.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
అవసరమా భయ్యా.. కొత్త జంట ఫస్ట్ నైట్ వీడియో అంటూ..(వీడియో)

అందులో పెన్షనర్ పుట్టిన తేదీ, PPO నంబర్ నమోదు చేయాలి.ఆ తర్వాత డాక్యుమెంట్స్ ను పొందడానికి, వివరాలను యాక్సెస్ చేయడానికి డిజిలాకర్ కు అనుమతి ఇవ్వాలి.

Advertisement

ఇందుకు PPO నంబర్ వరుసలో కింద కనిపించే చెక్ బాక్స్ ను క్లిక్ చేయాలి.ఆ తర్వాత గెట్ డాక్యుమెంట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే డాక్యుమెంట్ లభిస్తుంది.

వాట్సాప్ ద్వారా కూడా.డిజిలాకర్ లో సులువుగా డాక్యుమెంట్స్ స్టోర్ చేసుకోవడమే కాకుండా, ఈజీగా యాక్సెస్ చేసే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది.

ఇప్పుడు వాట్సాప్ ద్వారా డిజి లాకర్ ను యాక్సెస్ చేయవచ్చు.

దీని కోసం ముందుగా MyGov వాట్సాప్ నంబర్ 9013151515 కి Hai అని మెసేజ్ చేయాలి.అనంతరం డిజిలాకర్ సర్వీసెస్ ఆప్షన్ క్లిక్ చేసి, తదుపరి కనిపించే సూచనలను పాటించాలి.ఇలా అన్ని డాక్యుమెంట్స్ ను చూడవచ్చు, యాక్సెస్ చేయవచ్చు.

ప్రభుత్వ క్లౌడ్ బేస్డ్ సర్వీస్ డీజి లాకర్ (DigiLocker) యాప్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది.ఇది భారత ప్రభుత్వం అందిస్తున్న క్లౌడ్-బేస్డ్ సర్వీస్.

వినియోగదారులు వర్చువల్ గా తమ డాక్యుమెంట్ ను ఉపయోగించుకొనే సదుపాయం కల్పించింది.డిజిలాకర్ ద్వారా ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఎడ్కేకెషన్ సర్టిఫికేట్లు వంటి డాక్యుమెంట్స్ సేవ్ చేసుకోవచ్చు.

ఇప్పుడు డిజిలాకర్ సేవలు పెన్షన్ సర్టిఫికేట్లకు కూడా విస్తరించాయి.ఈ యాప్ సేవలు వినియోగించుకున్న పెన్షనర్లు యాప్ ను అభినందిస్తున్నారు.

తాజా వార్తలు