అది పిల్లలను ఏడిపించే పండుగ... విజేతను ఎలా నిర్ణయిస్తారంటే..

ప్రపంచవ్యాప్తంగా అనేక అద్భుతమైన కార్యక్రమాలు, సాంస్కృతిక ఉత్సవాలు జరుపుకుంటారు.అయితే వీటిలో కొన్ని చాలా వింతగా ఉంటాయి.

 The Crying Baby Festival Naki Sumo Event , Crying Baby, The Crying Baby Festival-TeluguStop.com

మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.అలాంటి ఒక ఉత్సవమే ది క్రయింగ్ బేబీ ఫెస్టివల్( The Crying Baby Festival ).సాధారణ జీవితంలో ఏ తల్లిదండ్రులూ తమ పిల్లలను ఏడిపించాలని కోరుకోరు.కానీ జపాన్‌లో మాత్రం పిల్లలను ఏడిపించేందుకు రెగ్యులర్ గా ఓ ఈవెంట్ జరుపుకుంటారు.జపాన్‌లో నాకీ సుమో ఈవెంట్ మళ్లీ ప్రారంభమైంది.400 ఏళ్లనాటి నాకీ సుమో ఈవెంట్‌ను జపాన్ అంతటా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు.ఇది పిల్లలను దుష్టశక్తుల నుండి కాపాడుతుందని, వారికి మంచి ఆరోగ్యం, అదృష్టాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు.నాకీ సుమో ఫెస్టివల్‌లో పిల్లలను పట్టుకుని వింత శబ్దాలు చేస్తూ, వారిని ఏడిపించే ప్రయత్నం చేస్తారు.

ఇందులో ఏ చిన్నారి ముందుగా ఏడుస్తుందో ఆ చిన్నారి పోటీలో గెలుస్తుంది.డజన్ల కొద్దీ జపాన్ పిల్లలను ఏడిపించే పోటీ ఇప్పుడు జపాన్‌లో ప్రారంభమైంది.ఈ పిల్లలను “క్రైయింగ్ సుమోస్”( Crying Sumos ) అంటారు.దీనివల్ల పిల్లలకు మంచి ఆరోగ్యం చేకూరుతుందని నమ్మకం.

Telugu Baby, Sumos, Japan, Sensojitemple, Baby Festival, Babyfestival, Tokyo-Lat

మహమ్మారి తర్వాత నాలుగేళ్ల అనంతరం తొలిసారిగా ఈ పండుగను జరుపుకుంటున్నారు.దాదాపు నాలుగు శతాబ్దాలుగా నాకీ సుమో పండుగను జరుపుకుంటున్నారు.ఇందులో పాల్గొనే పిల్లలకు దుష్ట శక్తుల బారి నుండి రక్షణ దొరుకుతుందటారు.ప్రసిద్ధ నాకీ సుమో (ది క్రయింగ్ బేబీ ఫెస్టివల్) జపాన్‌లోని టోక్యోలోని అసకుసాలోని సెన్సోజీ టెంపుల్ ( Sensoji Temple in Asakusa ) (పురాతన బౌద్ధ దేవాలయం)లో జరుగుతుంది.

జపాన్‌లోని షింటో పుణ్యక్షేత్రాలలో ఏటా నాకీ సుమో ఫెస్టివల్ జరుగుతుంది.ఈ గోల్డెన్ వీక్ ఏప్రిల్ చివరి వారం నుండి మే మొదటి వారం వరకు జరుపుకుంటారు.

ఏడుస్తున్న శిశువు దుష్టశక్తులను దూరంగా ఉంటుందని అంటారు.టోక్యో క్యాలెండర్ ప్రకారం నాకీ సుమో జపాన్‌లో 400 సంవత్సరాలకు పైగా జరుపుకుంటున్నారు.

Telugu Baby, Sumos, Japan, Sensojitemple, Baby Festival, Babyfestival, Tokyo-Lat

ఈ పండుగ జపనీస్ జానపద కథలతో ముడిపడి ఉందని చెబుతారు.స్థానికంగా జనాదరణ పొందిన పురాణాల్లో పేర్కొన్న వివరాల ప్రకారం అమాయక పిల్లల బిగ్గరగా ఏడ్చే ఏడుపు రాక్షసులను, ఇతర దుష్టశక్తులను తరిమికొడుతుంది.ఏడ్చే పిల్లలను చూసి దుష్టశక్తులు భయపడకపోతే, ఈ ఆత్మలు పిల్లలకు హాని కలిగిస్తాయని కూడా ప్రజలు నమ్ముతారు.ఈ పండుగకు మరొక ప్రేరణ మూలం జపాన్ సామెత ‘నాకు కో వా సోడాట్సు’( Naku ko wa sodatsu ), అంటే ‘ఏడ్చే పిల్లలు వేగంగా పెరుగుతారు’.

ఈ పోటీలో పాల్గొనే పిల్లల వయస్సు 6 నుండి 18 నెలల మధ్య ఉండాలి.ఇందుకోసం సుమో రెజ్లింగ్ రింగ్ లాంటిది తయారు చేస్తారు, దీనిలో సుమోల మధ్య పిల్లలు ఉంటారు.

ఈ పండుగను షింటో పూజారి ప్రారంభించారు.అతను దానికి సంబంధించిన అన్ని ఆచారాలను నెరవేర్చారు.

ప్రతి బిడ్డ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం అతను ప్రార్థిస్తాడు.మొదట ఏడుపు ప్రారంభించిన పిల్లవాడు గెలుస్తాడు.

రిఫరీ విజేతను ప్రకటిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube