పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ ”ఓజి”.( OG Movie ) ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి రోజుకొక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.
ఈ సినిమా నుండి మేకర్స్ కూడా వరుస అప్డేట్ లను ఇస్తూ మరింత ఇంట్రెస్టింగ్ అయితే పెంచేస్తున్నారు.ఇప్పటికే పలు పోస్టర్స్ తో పాటు ఈ సినిమాలో నటిస్తున్న క్యాస్ట్ గురించి కూడా ప్రకటిస్తూ క్రేజ్ పెంచుకుంటూ పోతున్నారు.
![Telugu Sujeeth, Iswarya Menon, Og, Pawan Kalyan, Thaman-Movie Telugu Sujeeth, Iswarya Menon, Og, Pawan Kalyan, Thaman-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/07/SPY-heroine-bags-Pawan-Kalyan-OG-Movie.jpg)
పవన్( Pawan Kalyan ) కూడా ఈ సినిమాపై ఇంట్రెస్ట్ బాగా పెట్టడంతో ఫ్యాన్స్ మరింత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను అలా ప్రకటించగానే వెంటనే షూట్ స్టార్ట్ చేసారు.ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి తాజాగా మరో అప్డేట్ వైరల్ అవుతుంది.ఈ సినిమాలో స్పై బ్యూటీ ఐశ్వర్య మీనన్( Iswarya Menon ) కూడా ఉంది అనే టాక్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఈ బ్యూటీ తమిళ్, మలయాళ సినిమాల్లో మంచి ఫేమ్ తెచ్చుకుంది.అయితే ఇప్పుడు స్పై సినిమాలో కనిపించింది.
ఈ సినిమాలో పెద్దగా ఆకట్టుకోలేక పోయిన ఈమెకు లక్కీ ఛాన్స్ దక్కింది అని టాక్.పవన్ కళ్యాణ్ ఓజిలో ఈ భామ ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టే అని ఇప్పటికే ఫోటో షూట్ కూడా జరిగింది అని తెలుస్తుంది.
మరి ఈ భామ రోల్ ఏంటో ఇంకా బయటకు రాలేదు కానీ ఈమె మాత్రం ఫిక్స్ అయినట్టే అంటున్నారు.
![Telugu Sujeeth, Iswarya Menon, Og, Pawan Kalyan, Thaman-Movie Telugu Sujeeth, Iswarya Menon, Og, Pawan Kalyan, Thaman-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/04/Priyanka-Mohan-joins-the-cast-of-Pawan-Kalyan-OG-detailsa.jpg)
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్( Priyanka Mohan )హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
మరి సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.