ప్రపంచంలో ఏ ఉగ్రవాద దాడి జరిగినా, మూలాలు మాత్రం మన హైదరాబాద్‌తోనే ఉండటం సర్వసాధారణంగా మారి పోయింది.దీనికి తోడూ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించే వారికి సోషల్ నెట్వర్కింగ్ సహకారణి అవుతున్న తీరు హైదరాబాద్ లో ఐఎస్ఐఎస్ తీవ్రవాది నిక్కీ జోసెఫ్ తో పాటు మరో యువకుడి అరెస్టుతో మరిన్ని నిజాలు వెలుగు చూసి, పోలీసులని ఆశ్చర్య పరిచాయి.
దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు వ్యూహం రచించించేందుకు సోషల్ నెట్‌వర్కింగ్‌ని ఆసరా చేసుకున్న కొందరు ఒక గ్రూప్‌గా ఏర్పడిన విషయం తెలియటంతో ఢిల్లీ ఎన్ఐఎ బృందం హైదరాబాద్‌కు చేరుకుంది., బుధవారం తెల్లవారుజామున ఏక కాలంలో పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు, స్థానిక పోలీసుల సహకారంతో సోదాలు చేసి, దాడులు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆరుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు.ఈ సమయంలో వారి నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలు, మారణాయుధాలు, విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని పలువురు ప్రముఖుల్ని లక్ష్యంగా చేసుకొని.పన్నిన ఉగ్ర కుట్రను పోలీసులు ఛేధించినట్లు పోలీసులు చెప్తున్నారు.
మరికొంతమంది ఐఎస్ఐఎస్ సానుభూతి పరులు ఈ ప్రాంతంలో ఉండే అవకాశం లేకపోలేదని దాడులను మరింత ముమ్మరం చేసి మరింత మందిని అదుపులోనికి తీసుకుంటామని తెలంగాణ పోలీసు వర్గాలు తెలిపాయి.కాగా ఎన్ఐఎ బృందం అనుమానిత ఆరుగురిని అదుపులోకి తీసుకొని ఢిల్లీకి తరలిస్తున్నారు.