తెలంగాణ రాజకీయాలు రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటుండటంతో పెద్ద ఎత్తున ఆసక్తిని రేకెత్తిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఇంకా ఎన్నికలకు రెండున్నర సంవత్సరాల సమయం ఉన్నా ఇప్పటి నుండే ఎన్నికల వాతావరణం అనేది నెలకొందని చెప్పవచ్చు.
అయితే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రానున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతున్న క్రమంలో కేసీఆర్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్న పరిస్థితి ఉంది.ఇప్పటికే ధర్నా చేస్తున్న ప్రతి ఒక్క విషయంపై సానుకూల నిర్ణయాలు తీసుకుంటూ ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరుస్తున్న పరిస్థితి ఉంది.
మధ్యాహ్న భోజన కార్మికులకు 3 వేల రూపాయల జీతం పెంపు నిర్ణయం, వీఆర్ఏలను, ఫీల్డ్ అసిస్టెంట్ లను విధుల్లోకి తీసుకోవడం లాంటి నిర్ణయాలతో సానుకూల వాతావరణం ఏర్పాటు చేసుకోవాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారా అనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాక ఉక్రెయిన్ నుండి వచ్చిన 700 మంది విద్యార్థులకు తెలంగాణలోని మెడికల్ కళాశాలల్లో విద్యా వకాశాలు కల్పించడం లాంటి నిర్ణయాలతో అన్ని వర్గాల ప్రజల మనస్సులు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది.
అయితే రానున్న రోజుల్లో ఇంకా తీసుకునే నిర్ణయాలను బట్టి మనకు ముందస్తుకు వెళ్ళడంపై ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.అయితే ముందస్తుకు వెళ్తే జరగబోయే పరిణామాలను అన్నింటినీ బేరీజు వేసుకొని మాత్రమే ముందుకెళ్ళే అవకాశం ఉంది.
ఒకవేళ క్లారిటీ లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం లేదు.అలా వెళ్తే రాజకీయంగా ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
ఉద్యోగ ప్రకటనలు నోటిఫికేషన్ లు ఇవ్వడం మొదలయ్యాక ఇక మరింతగా కెసీఆర్ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది.మరింతగా క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.