మామూలుగా ఒక హీరోయిన్ కు వరుస సినిమాలో అవకాశాలు వస్తున్నాయంటే దాని వెనుక ఏదో ఒక గట్టి కారణం ఉండే ఉంటుంది.అవకాశాల కోసం వారు కష్టపడ్డ తీరు అయిన లేదా కొన్ని కమిట్మెంట్ల వల్ల వరుసగా అవకాశాలు అందుకుంటుంటారు.
అయితే ఇప్పుడు రష్మిక మందన్న( Rashmika Mandanna ) కూడా ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉంది.ఈ బ్యూటీ ని జనాలు ఎంత ట్రోల్స్ చేసినప్పటికీ కూడా అవకాశాలు మాత్రం వెంట వెంటనే వస్తున్నాయి.
అయితే దీనికి కారణం ఒకటి ఉందని తెలిసింది.ఇంతకు అదేంటంటే.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఓ రేంజ్ లో పరుగులు తీస్తుంది.
ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ బ్యూటీ పేరు బాగా హాట్ టాపిక్ గా మారింది.అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకొని ప్రస్తుతం స్టార్ హీరోల సరసన పాన్ ఇండియా లెవెల్ లో దూసుకెళ్తుంది.

ఛలో సినిమాతో( Chalo Movie ) తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి తర్వాత గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో స్టార్ హోదాకు చేరుకుంది.అలా వరుసగా మంచి మంచి సక్సెస్ లు అందుకోగా ఇప్పుడు ఎవరికి అందనంత లెవెల్ లో దూసుకెళ్తుంది.పైగా బాలీవుడ్, కోలీవుడ్ నుంచి కూడా వరుస ఆఫర్స్ రావటంతో అక్కడ కూడా చాలా బిజీగా మారింది.దీంతో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ గా మారింది.
మామూలుగా బాలీవుడ్లో అడుగుపెట్టడానికి ఎంతో మంది హీరోయిన్లు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నారు.కానీ రష్మికకు మాత్రం అడుగుపెట్టిన తొలినాళ్లలోని బాలీవుడ్ లో( Bollywood ) కూడా అవకాశాలు వచ్చాయి.

ఇక ఈ బ్యూటీ.ఎంత బిజీ లైఫ్ లో ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియా మాత్రం ఖచ్చితంగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.ప్రతిరోజు ఫోటోషూట్లు చేయించుకుంటూ వెంటనే వాటిని నెట్టింట్లో పెట్టి బాగా రచ్చ చేస్తుంది.అప్పుడప్పుడు సినిమాకు బ్రేక్ దొరికితే చాలు బయట దేశాలలో తిరుగుతూ హల్చల్ చేస్తుంది.
ఇక మొత్తానికి ఈ బ్యూటీ కి ఇప్పుడు బాగా కలిసి వచ్చింది.కొత్త హీరోయిన్స్ ఎంత మంది వచ్చినా కూడా ఈ బ్యూటీని మాత్రం అసలు వదలట్లేదు దర్శకనిర్మాతలు.
ఇక ధైర్యం చూసుకునే రష్మిక రోజురోజుకి మరింత పరుగులు తీస్తుంది.

అయితే రష్మికకు ఇలా వరుస పెట్టి అవకాశాలు రావడానికి ఒక రీజన్ ఉంది.మామూలుగా ఒక హోదాకి వచ్చాము అంటే హీరోయిన్స్ రెమ్యూనరేషన్ విషయంలో అస్సలు తగ్గరు.చివరికి నిర్మాతలే కాంప్రమైజ్ అయి అడిగినంత ఇవ్వాలి కానీ.
నిర్మాతలు ఇచ్చినంత ఒప్పుకోరు.కానీ రష్మిక అలా కాదు.
నిర్మాతలకు ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా వాళ్ళు ఇచ్చినంతనే ఓకే అనేసి తీసుకుంటుందట.అందుకే చాలామంది రష్మిక కు అవకాశాలు ఇస్తారని తెలిసింది.







