రాహుల్ గాంధీని ఎంపీగా అనర్హుడ్ని చేసే కుట్ర జరుగుతుందా?

ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఏదైనా కేసులో నేరం నిరూపించబడి రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు శిక్ష పడిన సభ్యులకు రాజకీయాల్లో పోటీ చేసే అర్హత నిషేధించబడింది.నిజానికి రాజకీయాల్లో విమర్శలు మామూలు విషయం అయితే ఆ విషయంలో రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ఆ సమయంలో కొంత హద్దు మీరితే మీరీ ఉండొచ్చు కానీ ఈ విషయంలో రెండు సంవత్సరాల శిక్ష అన్నది సబబుగా కనిపించడం లేదు.

 Rahulgandhi Surast Court Judgement , Lalita Modi, Nirav Modi ,  Mallikarjuna Kha-TeluguStop.com

ఇది తమ నాయకుడిని పార్లమెంట్లో లేకుండా చేయడానికి బిజెపి ( BJP )పన్నుతున్న కుట్ర అని కాంగ్రెస్ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి వివరాల్లోకి వెళితే 2019లో ఒక సభలో మాట్లాడుతూ దొంగలు అందరికీ ఒకే ఇంటి పేరు ఎందుకు ఉంటుందంటూ లలిత మోడీ, నీరవ్ మోడీ( Lalita Modi, Nirav Modi ) ,లను ఉదంతాలను మోడీ పేరుకు ముడిపెడుతూ ఆయన ఈ విమర్శలు చేశారు.తమ కమ్యూనిటీని అవమానపరిచేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ గుజరాత్ బిజెపి ఎమ్మెల్యే మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ ( Purnesh Modi )సూరత్ కోర్టులో ఆయన పై పరువు నష్టం దావా వేశారు దీనిపై విచారణ చేసిన కోర్ట్ ఆయనను దోషిగా నిర్ధారించి రెండు సంవత్సరాల శిక్ష విధించింది.

Telugu Lalita Modi, Nirav Modi, Rahul Gandhi-Telugu Political News

దీనిపై స్పందించిన కాంగ్రెస్ పార్లమెంటరీ( Congress Parliamentary ) నాయకుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjuna Kharge ) బిజెపి జడ్జిలను మార్చినప్పుడే ఈ తీర్పు వస్తుందని తమకు తెలుసు అంటూ వ్యాఖ్యలు చేశారు .తమ నాయకుడి కి శిక్ష పడింది అని తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపే కార్యక్రమాలు మొదలుపెట్టారు.ఏది ఏమైనా రెండు సంవత్సరాలు శిక్ష ఈ వ్యవహారంలో కక్ష సాధింపు చర్య గానే కనిపిస్తుంది ఎందుకంటే ఇంతకంటే దారుణమైన వ్యాఖ్యలు చేసిన చాలా మంది నాయకులు బిజెపిలో ఉన్నారు.చంపేస్తాం నరికేస్తాం లాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన వారిపై ఎటువంటి శిక్షలు లేవు .కానీ వ్యంగ్యంగా చేసిన ఈ వ్యాఖ్యల కోసం రెండు సంవత్సరాలు జైలు శిక్ష వేయటం అన్నది ఈ తీర్పులో నిజాయితీ ప్రస్నార్థకం అవుతుంది.అయితే వెంటనే బెయిల్ ఇచ్చి 30 రోజులు పాటు ఆ శిక్షను నిలిపేసి ఈ తీర్పుపై సవాలు చేసుకునే అవకాశం ఇవ్వటం కొంత .ఊరటనే చెప్పాలి.కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube