థైరాయిడ్ ప్రమాదకరమైన సమస్యా? నిర్ల‌క్ష్యం చేస్తే ఏం అవుతుంది?

థైరాయిడ్.ఇటీవ‌ల కాలంలో ఈ వ్యాధి పెద్ద‌ల్లోనే కాదు టీనేజ్‌ పిల్ల‌ల్లోనూ అధికంగానే క‌నిపిస్తోంది.

ఆహార‌పు అల‌వాట్లు, అయోడిన్ లోపం, పలు రకాల మందుల వాడ‌కం, అధిక ఒత్తిడి, ప్రసవం తర్వాత హార్మోన్లలో వ‌చ్చే మార్పులు, శ‌రీరంలో పోష‌కాల కొర‌త ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల థైరాయిడ్ బారిన ప‌డుతుంటారు.అలాగే జన్యుపరంగా సైతం కొంద‌రికి ఈ వ్యాధి సక్ర‌మిస్తుంది.

దీర్ఘ‌కాలిక వ్యాధుల్లో థైరాయిడ్ కూడా ఒక‌టి.ఒక్క సారి వ‌చ్చిందంటే జీవిత కాలం మందులు వాడాల్సి ఉంటుంది.మ‌రియు ఆరోగ్యం విష‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

అయితే చాలా మంది థైరాయిడ్‌ను ప్రమాదకరమైన సమస్య‌గా భావించారు.ఈ క్ర‌మంలోనే దాని విష‌యంలో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు.

Advertisement
Is The Thyroid A Dangerous Problem Thyroid, Thyroid Patients, Good Foods For Th

కానీ, నిర్ల‌క్ష్యం చేసే కొద్దీ థైరాయిడ్ వ్యాధి ప్ర‌మాద‌క‌రంగా మారిపోతుంది.అవును, థైరాయిడ్‌కి స‌రైన చికిత్స తీసుకోకుంటే.

గుండె పోటు, నరాలు బలహీనంగా మారిపోవ‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే రిస్క్ చాలా ఎక్కువ‌గా ఉంటుంది.అందుకే థైరాయిడ్ సమస్య ఉందని తెలిసి వెంట‌నే చికిత్స తీసుకోవాలి.

Is The Thyroid A Dangerous Problem Thyroid, Thyroid Patients, Good Foods For Th

ఇక థైరాయిడ్ ఉన్న వారు.రోజూ మందులు వేసుకుంటూనే డైట్‌లో పోష‌కాహారం ఉండేలా చూసుకోవాలి.పాలు, గుడ్లు, బ్రెజిల్ నట్స్, అవిసె గింజలు, పెరుగు, చేపలు, తాజా పండ్లు, కూర‌గాయ‌లు, మ‌న‌గాకు, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి మంచి ఆహారాలు తీసుకుంటే థైరాయిడ్ వ్యాధి కంట్రోల్‌లో ఉంటుంది.

అదే స‌మ‌యంలో క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రొకొలీ, ముల్లంగి, చిలగడదుంప, పాలకూర, కేల్, సోయా బీన్స్, పీచ్, అవకాడో వంటి ఆహారాల‌కు దూరంగా ఉండాలి.ఇవి ఆరోగ్యానికి మంచివే అయిన‌ప్ప‌టికీ థైరాయిడ్ వ్యాధి బాధితులు మాత్రం వీటిని తీసుకోరాద‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

ఎందుకంటే, వీటిలో గాయిటరోజెన్స్ ఎక్కువగా ఉంటుంది.ఇది థైరాయిడ్‌ను మ‌రింత తీవ్ర త‌రం చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు