తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న కుర్ర హీరోల్లో నాగ శౌర్య కూడా ఒకరు ఈయన ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరో గా పరిచయం అయ్యాడు.ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడం తో వరుసగా చాలా సినిమాలు చేశాడు కానీ ఆయనకి వచ్చిన హిట్స్ మాత్రం చాలా తక్కువనే చెప్పాలి.
అందులో ఛలో సినిమా ఒకటి ఈ సినిమా వచ్చి చాలా రోజులు అవుతుంది.అయినప్పటికీ ఇదే నాగ శౌర్య చివరి సక్సెస్ సినిమా అనే చెప్పాలి దాని తరువాత చాలా సినిమాలు చేసినప్పటికీ అవేవీ పెద్ద సక్సెస్ సాధించలేదనే చెప్పాలి.
ప్రస్తుతం ఆయన కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీ గా ఉన్నప్పటికీ నాగ శౌర్య కి ఇప్పుడు ఒక హిట్ చాలా అవసరం ఎందుకంటే ఇప్పటికే ఆయన మార్కెట్ బాగా డౌన్ అయింది ఇలాగే ఇంకో 2,3 సినిమాలు కనక ప్లాప్ అయితే నాగ శౌర్య కెరియర్ డైలమా లో పడుతుంది అందుకే ఎంత తొందరగా హిట్ కొడితే అది ఆయనకి అంత మంచిది.

ఇప్పటికే కుర్ర హీరో అయిన సందీప్ కిషన్ కెరియర్ చాలా డల్ గా సాగుతుంది.నాగ శౌర్య కి కనక ఇక ముందు ప్లాప్ లు వస్తె ఇక ఇయన పరిస్థితి కూడా సందీప్ కిషన్ లాగే అయిపోతుంది.అయితే నాగ శౌర్య చాలా సినిమాలు చేస్తున్నప్పటికీ ఎందుకు ఆయనకి హిట్ పడడం లేదు అంటే ఇండస్ట్రీ లో ఈయన్ని దగ్గర గా చూసిన వాళ్ళు చెప్పే మాట ఒకటే ఈయన స్క్రిప్ట్ లో వేళ్ళు ఎక్కువ గా పెడతాడు అని దానివల్ల ఆ స్క్రిప్ట్ మారిపోయి అద్భుతం గా ఉన్న స్క్రిప్ట్ చెడిపోతుంది అని అంటున్నారు.
ఆ ఒక్కటి కనక మార్చుకొని డైరెక్టర్ ఏం అనుకుంటున్నాడో అది ఆయన్ని కరెక్ట్ గా తీయనిస్తే ఆయన పక్క హిట్ కొట్టవచ్చు… అంతే తప్ప స్క్రిప్ట్ లో ఈయన ఇన్ పుట్స్ ఎక్కువ గా ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు…
.







