మోడీ సర్కార్ అయోమయంలో పడిందా ?

కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న అందులో బీజేపీలో( BJP party ) లాభం చేకూరే అంశాలు కచ్చితంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహంలేదు.మరి ముఖ్యంగా ఎన్నికల వేళ తీసుకునే ప్రతి నిర్ణయం పార్టీకి ఎంతమేర ఉపయోగ పడుతుంది మళ్ళీ వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కించుకునేందుకు ఆ నిర్ణయం సరైనదా కదా ? ఇలా అన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రణాళికలు రచిస్తుంటారు కేంద్ర పెద్దలు.

తాజాగా జమిలి ఎలక్షన్స్ విధానం కూడా బీజేపీకి లాభం చేకూర్చేందుకే కేంద్ర పెద్దలు అటువైపు అడుగులు వేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే ఒకవేళ జమిలి ఎలక్షన్స్( Jamili Elections ) నిర్వహించాల్సి వస్తే.ముందస్తుగా నిర్వహిస్తారా లేదా షెడ్యూల్ ప్రకారమే అమలు చేస్తారా అనే దానిపై క్లారిటీ లేదు.దీనిపై మోడీ( Narendra Modi ) సర్కార్ కూడా గందరగోళానికి గురౌతున్నట్లు తెలుస్తోంది.

ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ విధానంలో భాగంగా దేశంలోని అన్నీ రాష్ట్రాలకు సంబధించిన అసెంబ్లీ ఎన్నికలను లోక్ సభ ఎన్నికలతో కలిపి ఒకే సారి నిర్వహించాలని చూస్తోంది.ఇప్పటికే కసరత్తులు కూడా ప్రారంభించింది.

ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికల ప్రస్తావన తరచూ తెరపైకి వస్తోంది.ఎందుకంటే ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

అందువల్ల వీటితోపాటు లోక్ సభ ఎన్నికలను అలాగే వచ్చే ఏడాది జరిగే మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను అన్నిటికి కలిపి ఒకేసారి నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి.

అయితేకేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశమే లేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్( Anurag Thakur ) ఇటీవల స్పష్టం చేశారు.వచ్చే ఏడాది షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పుకొచ్చారు.దీంతో జమిలి ఎలక్షన్స్ పై మరింత కన్ఫ్యూజన్ ఏర్పడుతోంది.

ఒకవేళ వచ్చే ఏడాది జమిలి ఎలక్షన్స్ అమలైతే.ఈ ఏడాది చివర్లో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేస్తారా ? అందుకు ఆ రాష్ట్ర ప్రబుత్వాలు పార్టీలు ఒప్పుకునే అవకాశం ఉందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.దీంతో అటు ముందస్తు ఎన్నికలకు వెళ్లలా లేదా షెడ్యూల్ ప్రకారమే నిర్వహించలా అనే దానిపై మోడీ సర్కార్ అయోమయంలో పడినట్లు తెలుస్తోంది.

మరి వీటన్నిటికి క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.

సినిమా ఫ్లాప్ అయినా వాణిశ్రీ కట్టిన ఆర్గాండి వాయిల్ చీరలు ఫుల్ ఫేమస్
Advertisement

తాజా వార్తలు