ఆ డిమాండ్ చంద్ర‌బాబుకు విమ‌ర్శ‌లు తెస్తోందా..

చంద్ర‌బాబు నాయుడు అంటే రాజ‌కీయ చాణ‌క్యుడు అనే బిరుదు ఉండేది.

ఆయ‌న ఏ ప‌ని చేసినా ఎంతో ముందు జాగ్ర‌త్త‌తో భ‌విష్య‌త్ రాజ‌కీయ ల‌బ్ధిని దృష్టిలో పెట్టుకుని చేస్తార‌ని టాక్ ఉండేది.

అయితే ఇప్పుడు మాత్రం ప‌రిస్థితి అందుకు భిన్నంగా ఉంది.ఎందుకంటే ఇప్పుడు ఆయ‌న క‌నీసం ఏదైనా విమ‌ర్శ చేసినా లేదంటే క‌నీసం ఒక స‌మ‌స్య‌పై మాట్లాడినా కూడా తిరిగి ఆయ‌న‌కు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

గ‌తంలో ఉన్న‌ప్పుడు ఆయ‌న చేసిన పాప‌మే ఇది అంటూ వైసీపీ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేయ‌డంతో టీడీపీ చ‌ల్ల‌బ‌డుతోంది.కాగా ఇప్పుడు చంద్ర‌బాబు నాయుడు మ‌రో డిమాండ్ చేస్తున్నా కూడా చివ‌ర‌కు ఆయ‌న‌కే విమ‌ర్శ‌లు తెస్తోంది.

అదేంటంటే ఇప్పుడు రాష్ట్రంలో పోలీసులు త‌మ స్వయంప్రతిపత్తితో ప‌నిచేయాల‌ని, అంతేగానీ అధికారి పార్టీకి అనుకూలంగా ప‌నిచేయ‌డ‌మేంట‌ని వాపోతున్నారు.ఇక్క‌డే ఆయ‌న చేసిన డిమాండ్ చాలా విచిత్రంగా ఉంద‌ని చాలామంది అంటున్నారు.

Advertisement
Is That Demand Bringing Criticism To Chandrababu ,ycp,cm Jagan Ap News -ఆ డ�

ఎందుకంటే గంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కూడ ఇలాగే చేశారు క‌దా అంటున్నారు.మ‌రి అప్పుడు కూడా ఆయ‌న పోలీసుల‌ను ఇలాగే వాడుకున్నార‌ని చెప్తున్నారు.

Is That Demand Bringing Criticism To Chandrababu ,ycp,cm Jagan Ap News

అస‌లు టీడీపీ హ‌యాంలో ఉన్న‌ప్పుడు కూడా ఇలాగే పోలీసుల‌ను వాడుకుని వైసీపీ నేతలు అలాగే ఆ పార్టీ ఎమ్మెల్యేల‌పై చాలానే కేసులు పెట్టారు క‌దా.మ‌రి ఇప్పుడు అవ‌న్నీ ఆయ‌న మరచిపోయినట్లున్నారు అని వైసీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు.టీడీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో పోలీసులను చంద్ర‌బాబు నాయుడు ఎలా వాడుకున్నారో ఇప్పుడు జ‌గ‌న్ కూడా అదే ప‌నిచేస్తున్నార‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

ఆయ‌న స్వేఛ్చ ఇవ్వ‌కుండా ఇప్ప‌డు ఇలాంటి డిమాండ్ చేయ‌డ‌మేంట‌ని విమ‌ర్శిస్తున్నారు నెటిజ‌న్లు.మొత్తానికి చంద్ర‌బాబు డిమాండ్ ఆయ‌న‌కే విమ‌ర్శ‌లు తెస్తోంది.మ‌రి చంద్ర‌బాబు ఇంకెలాంటి రాజ‌కీయాల‌తో ముందుకు వెళ్తారో.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు