సురేఖ వాణి తన కూతురిని హీరోయిన్ గా దింపుతోందా..?

తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ "సురేఖ వాణి" గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగులు నిలిపి వేశారు.

 దీంతో సురేఖ వాణి సెలవులను బాగానే ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు తన కూతురు సుప్రీతతో కలిసి పర్యాటక ప్రాంతాలకి , లాంగ్ రైడ్ లకి వెళుతూ తన ఫోటోలను సోషల్ మీడియా షేర్ చేస్తోంది.

అయితే తాజాగా నటి సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే తొందర్లోనే సురేఖ వాణి తన కూతురు సుప్రీతను హీరోయిన్ గా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేయబోతోందని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

 అంతేగాక ఇప్పటికే సోషల్ మీడియాలో సుప్రీతని చుసిన ఓ ప్రముఖ దర్శకుడు తన చిత్రంలో యంగ్ హీరో సరసన హీరోయిన్ గా నటించే అవకాశం ఇచ్చాడట.దీంతో అన్ని కుదిరితే వచ్చే ఏడాది సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం ఖాయమని టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Advertisement

అయితే గతంలో నటి సురేఖ వాణి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన కూతుర్ని హీరోయిన్ చేయనని తెలిపింది.  కానీ ప్రస్తుతం సుప్రీత సోషల్ మీడియా మాధ్యమాలలో ఫాలోయింగ్ బాగా పెరగడంతో సినిమా ఆఫర్లు తలుపు తడుతున్నాయట.

 దీంతో సురేఖ వాణి తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు సమాచారం.

అయితే ఇప్పటివరకు సుప్రీత అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను మూడు లక్షల పైచిలుకు మంది ఫాలో అవుతున్నారు.కాగా సుప్రీత అప్పుడప్పుడు పలు ఫోటోషూట్ సంస్థలు నిర్వహించిన ఫోటో షూట్ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ అందమైన ఫొటోలకి ఫోజులు ఇస్తోంది.అంతేగాక ఆ అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్లను బాగానే ఆకట్టుకుంటోంది.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు