కిషన్‌రెడ్డి అన్నట్లు తెలంగాణ రాష్ట్రం దివాళా తీస్తోందా?

తెలంగాణ బీజేపీ నేతల్లో కిషన్‌రెడ్డి సీనియర్ లీడర్.ఆయన ప్రస్తుతం కేంద్ర మంత్రి కూడా.

ఆయనకు సౌమ్యుడు అనే బిరుదు ఉంది.కానీ కిషన్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడతారనే ఆరోపణలు ఉన్నాయి.

తాజాగా సీఎం కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి ఆరోపణలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై ప్రజలు విసిగిపోయారని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

దేశంలో త్వరలోనే గుణాత్మక మార్పు వస్తుందో.రాదో తెలియదు కానీ రాష్ట్రంలో మాత్రం మార్పు రావడం తథ్యమన్నారు.

Advertisement

సీఎం కేసీఆర్ చెప్తున్నప్రళయాలు, భూకంపాలకు ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.గతంలో జరిగిన హుజురాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా వేల కోట్లు ఖర్చుపెట్టినా టీఆర్ఎస్ ఓటమిపాలైందని.

అయినా ఆ పార్టీలో మార్పు రాలేదని కిషన్‌రెడ్డి చురకలు అంటించారు.సూర్యుడిపై ఉమ్మేసిన చందంగా టీఆర్ఎస్ నేతలు బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

ఆదాయ వనరులుగా ఉన్న హైదరాబాద్ నగరంలో పేద ప్రజల నివాస ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.మరోవైపు తెలంగాణ రాష్ట్రం దివాళా తీస్తోందని కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

హైదరాబాద్ నగరం నుంచి 80 శాతం ఆదాయం వస్తున్నా అభివృద్ధి శూన్యమన్నారు.జీహెచ్ఎంసీ జలమండలి ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలే గుణపాఠం చెప్తారని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.పెట్రోల్, డీజిల్, గ్యాస్‌పై కేంద్రం పన్నులు తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.అయితే కిషన్‌రెడ్డి ఆరోపించిన విధంగా తెలంగాణ రాష్ట్రం దివాళా తీస్తుందా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.

Advertisement

హైదరాబాద్‌ నుంచి వేల కోట్లు ఆదాయం వస్తుందని.అలాంటప్పుడు తెలంగాణ దివాళా ఎందుకు తీస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఒకవేళ తెలంగాణ రాష్ట్రం దివాళా తీయడం నిజమైతే ధనిక రాష్ట్రం అని టీఆర్ఎస్ నేతలు ఎందుకు ప్రచారం చేసుకుంటారని సందేహాలు వ్యక్తం చేస్తన్నారు.

తాజా వార్తలు