పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ”ఆదిపురుష్”. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించారు.
ఇందులో ప్రభాస్ రాముడిగా నటిస్తుంటే.సీతగా కృతి సనన్ నటిస్తుంది.
లంకేశ్వరుడు రావణాసురిడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.లక్ష్మణుడిగా బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటిస్తున్నాడు.
వీరితో పాటు మరింత భారీ తారాగణం ఇందులో భాగం అయ్యారు.ఇక ఇటీవలే ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చెయ్యగా భారీ ట్రోలింగ్ చేసిన విషయం తెలిసిందే.
ఓం రౌత్ రామాయణం మొత్తం మార్చి తీసారని పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి.భారీ ట్రీట్ ఉంటుంది అని అనుకున్న ఫ్యాన్స్ అందరిని ఓం రౌత్ నిరాశ పరిచాడు.
ఇంత పెద్ద ఎత్తున ట్రోలింగ్ రావడంతో ఈ సినిమాను సంక్రాంతి బరిలో నుండి తప్పిస్తూ జూన్ 16కు వాయిదా వేశారు.
ప్రేక్షకులకు పూర్తిగా అద్భుతమైన విజువల్ అనుభూతి ఇవ్వడం కోసం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో పలు కీలక మార్పులు చేస్తున్నట్టు సమాచారం.ముఖ్యంగా లంకేశ్వరుడు పాత్ర ను పూర్తిగా రీషూట్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.ఈ పాత్రతో పాటు వానర సైన్యం పాత్రలలో కూడా కీలక మార్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ రీ షూట్ అంశం అనేది పెద్ద రిస్క్ తో కూడుకున్న విషయం.మాములు షూట్ లాగానే నటీనటులు మళ్ళీ తమ డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది.ఇది కూడా పెద్ద సమస్యనే అవుతుంది.
వాటి డేట్స్ కోసం ఎదురు చూసి ఈ షూట్ ను పూర్తి చేసి మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేసి రిలీజ్ చేయాల్సి ఉంటుంది.మరి ఇంత ప్రాసెస్ ఉండడంతో జూన్ వరకు అయినా రిలీజ్ చేయడానికి సమయం సరిపోతుందో లేదో.